RIFA hospital

RIFA hospital We provide out patient services to all ages of people (whole family). Every single disease is treate

23/10/2022

రిఫా హాస్పిటల్ మూసివేయనున్నారు.
డాక్టర్ గారు తిరుపతి కి బదిలీ అయ్యారు.
డిసెంబర్ 1వ తేదీ,2022నుండి పూర్తిగా close చేయబడును.

11/08/2022

అకస్మిక, అసహజ మరణం-కారణం- హార్ట్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్.

ఎందుకు - హైపర్ టెన్షన్ (హై బీపీ) ఉండి కంట్రోల్ లో లేక పోవడం (ముఖ్య కారణం).

ఏం చేయాలి - డాక్టర్ (ఎంబీబీఎస్ లేదా అంతకంటే ఎక్కువ) తో తరుచూ బీపీ చెక్ చేయించు కోవాలి.

ఎందుకూ అంటే ఒక mbbs స్టూడెంట్ బీపీ చెక్ చేయడం 5సం: పాటు నేర్చుకుంటాడు. ఖచ్చితంగా చెక్ చేయగలడు. సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలడు.

02/05/2022

Eid Mubarak to all our customers. Tomorrow( 3rd May) doctor not available.

బరువు తగ్గడానికి ఏకైక మార్గం - తక్కువ తినడం ఎక్కువ శ్రమ లేదా వ్యాయామం (పరిగెత్తడం, ఆటలు ఆడటం, ఈత కొట్టడం, కనీసం వేగంగా న...
31/12/2021

బరువు తగ్గడానికి ఏకైక మార్గం - తక్కువ తినడం ఎక్కువ శ్రమ లేదా వ్యాయామం (పరిగెత్తడం, ఆటలు ఆడటం, ఈత కొట్టడం, కనీసం వేగంగా నడవడం) రోజు కనీసం 45 నిమిషాలు.

అంతే కానీ స్పెషల్ డైట్, టాబ్లెట్స్, ఆపరేషన్స్ ఇవన్నీ వృథా (డబ్బు, సమయం).

Shortcut (దగ్గర దారి) లేదు.

పరిగెత్తు ,ఈ రోజే మొదలు పెట్టు.
Happy new year

13/12/2021

మా హాస్పిటల్ కి వచ్చే చిన్న పిల్లలకి అందరికీ కంటి చూపు చెక్ చేయడం ఒక అలవాటు.
ముఖ్యంగా తలనొప్పి తో వచ్చే వారికి.
మన దేశంలో ప్రతి 100 మందిలో 10 మంది పిల్లలకు కంటి చూపు సమస్యలు ఉన్నాయని సర్వే లు చెపుతున్నాయి.
వీటిలో ఎక్కువ భాగం అద్దాలు పెట్టుకుంటే చూపు సరిగ్గా కనిపిస్తుంది.
కానీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అద్దాలు పెట్టుకుంటే చిన్న చూపు లా భావించి అశ్రద్ధ చేస్తున్నారు.
పిల్లలు క్లాస్ లో బోర్డ్ సరిగ్గా కనిపించడం లేదని, అర్థం కావడం లేదని చెప్పినప్పుడు తేలిగ్గా తీసుకో కూడదు. ఖచ్చితంగా కంటి డాక్టర్ తో సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
కంటి అద్దాలు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, పిల్లలకు కాన్ఫిడెన్స్ పెరిగి బాగా చదువుకో గలరు. కంటి చూపు సమస్య ఉన్న పిల్లలు అద్దాలు వాడక పోతే ఇంకా ఎక్కువ సమస్య అవడమే కాక కంటి నరం (రెటీనా) దెబ్బ తినే అవకాశం ఉంది.
అపోహలు:
బాగా తిండి తింటే సరిపోతుంది అంటారు కొంతమంది,కానీ పోయిన చూపు తిరిగి రాదు. ఖచ్చితంగా అద్దాలు వాడాల్సిందే.
కేవలం చదువుకునే టప్పుడు పెట్టుకుంటే చాలు,
తప్పు నిద్ర పోయే టపుడు తప్ప ఎల్లవేళల అద్దాలు పెట్టుకోవాలి. లేకపోతే కళ్ళు త్వరగా అలసిపోయి తలనొప్పి వస్తుంది.
అద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతూ పోతుంది అనేది పొరపాటు, కంటి చూపు బెటర్ అవుతుంది తప్ప ఎక్కువ కాదు.
Note: కంటి చూపు సరిగ్గా లేకపోతే అద్దాలు తప్పనిసరి అది నీకైనా, నాకైనా, ఆఖరికి మన మోడీ గారికి అయినా. వేరే దారి లేదు.

16/10/2021

రక్తపోటు/బీపీ లేదా హైపర్ టెన్షన్ అపోహలు/నిజాలు.
అ: నాది చిన్న వయసు, అప్పుడే నాకు బీపీ ఏంటి?
వా: బీపీ ఏ వయసు వారికైనా రావచ్చు, చిన్న పిల్లలకి కూడ బీపీ వచ్చే కొన్ని జబ్బులు ఉన్నాయి.
అ: నాకు బీపీ కి సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవు, చెక్ చేసినపుడు 140/90 కంటే ఎక్కువ ఉంది. దానికే నేను టాబ్లెట్స్ వాడాలా?
వా: ఖచ్చితంగా వాడాలి. బీపీ కి సంబంధించిన లక్షణాలు (తల తిరగడం, తల నొప్పి, కడుపు నొప్పి, ఆయాసం, చెమటలు పట్టడం) అందరికీ ఉండక పోవచ్చు. అలాగని టాబ్లెట్స్ మానరాదు.
అ: నేను ఉప్పు తగ్గిస్తాను, వాకింగ్ బాగా చేసి బీపీ కంట్రోలు చేస్తా అంతేకాని టాబ్లెట్స్ వాడను.
వా: తప్పు, వాకింగ్, ఉప్పు తగ్గించడం ఇవన్నీ అదనపు చర్యలు, ఇవి టాబ్లెట్స్ కి ప్రత్యామ్నాయం కావు.
అ: నేను టాబ్లెట్స్ వాడను, వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
వా: బీపీ నియంత్రణ లో లేకపోతే వచ్చే దుష్పరిణామాలు (ఉదా: హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం, కిడ్నీ ఫెయిలుర్ ) కంటే టాబ్లెట్స్ వల్ల చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
గమనిక: 25 సం. దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా డాక్టర్ దగ్గర బీపీ చెక్ చేయంచుకోవాలి. టాబ్లెట్ వాడుతూ ఉన్నవాళ్లు కంట్రోల్ లో ఉందా లేదా అని 6 నెలలకి ఒకసారి చూపించుకోవాలి.

12/10/2021

షుగర్ (డయాబెటీస్) పేషంట్స్ కి ఇన్సులిన్ గురించి ఉన్న అపోహలు- నివృత్తి.
1. నేను ఫుడ్ కంట్రోల్ బాగా చేస్తా, వాకింగ్ కూడ చేస్తా, టాబ్లెట్స్ కరెక్ట్ గా వాడుతున్నా. అయినా యెందుకు షుగర్ తగ్గడం లేదు, ఇన్సులిన్ ఎందుకు వాడాలి.
స: శరీరంలో షుగర్ ని అదుపులో ఉంచడానికి ఇన్సులిన్ సహాయ పడుతుంది. మనం చేసే వ్యాయామం, డైట్, టాబ్లెట్స్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయడానికి లేదా ఉన్న ఇన్సులిన్ ని శరీరం సక్రమంగా వినియోగించడానికి సహాయ పడతాయి. కానీ కొంతమంది లో షుగర్ వచ్చిన కొన్నేళ్లతర్వాత ఇన్సులిన్ శరీరం ఉత్పత్తి చేయలేదు. అప్పుడు తప్పకుండా ఇన్సులిన్ ని ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. తద్వారా షుగర్ కంట్రోల్ లో ఉండడమే కాక అన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
2. ఇన్సులిన్ ఒకసారి వాడితే అదే అలవాటు అవుతుంది, మళ్లీ టాబ్లెట్స్ పనిచేయవు, డోస్ పెంచుకుంటూ పోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నొప్పిగా ఉంటుంది, అందరూ చూస్తే అప్పుడే ఇన్సులిన్ వాడుతున్నవా అంటారు, ఇన్సులిన్ రేట్ ఎక్కువ.
సమాధానం: ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. మనుషులు అందరిలో ఇన్సులిన్ ఉంటుంది, షుగర్ ఉన్న వాళ్లకు తక్కువగా ఉండడం వల్ల సూది మందు రూపంలో ఇస్తారు. అదే అలవాటు కావడానికి ఇది మత్తు పదార్థం కాదు, మనం ముందు ఎలా ఉన్నామో అలాగే ఉండవచ్చు, ఇన్సులిన్ వల్ల సడెన్ గా షుగర్ తగ్గిపోవడం జరగదు ఇప్పుడు ఉన్న కొత్త రకం ఇన్సులిన్ స్లో గా పనిచేస్తూ 24 గంటలు షుగర్ అదుపులో ఉండేలా చేస్తుంది. ఒకప్పుడు ఇన్సులిన్ సిరింజ్ లు పొడవుగా, లావుగా ఉండేవి కాని ఇప్పుడు చాలా సన్నగా ఉండి నొప్పి లేకుండా స్వయంగా సూది వేసుకోవచ్చు, ఎవరో వచ్చి రోజు సూది వేయాల్సిన పనిలేదు, నేర్చుకోవడం సులభం. రోజూ ఒకసారి వేసుకుంటే 24 గంటలు షుగర్ కంట్రోల్ చేసే ఇన్సులిన్ లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చాలా రకాల టాబ్లెట్స్ కంటే ఇన్సులిన్ ధర తక్కువే.

మరిన్ని షుగర్ మరియు ఇన్సులిన్ కి సంబంధించిన అపోహలు ఉంటే సంప్రదించండి.
రిఫా హాస్పిటల్, బ్యాంక్ అఫ్ బరోడా ఎదురుగా
హోమస్ పేట, ప్రొద్దుటూరు.

29/09/2021

ఇటీవల ముప్పై ఏళ్ల లోపు వారికి కూడా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతున్నారు. వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉన్నవాళ్లు, ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేవు. మరి ఎందుకు.. విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల అని కనుగొన్నారు. ఉద్యోగాలలో, రోజు వారీ పనులలో, ఫ్యామిలీ రిలేషన్స్ లో ఒత్తిడి పెరిగి .
మరి మన గుండె పదిలంగా ఉండాలంటే:
1.ఉదయం త్వరగా లేవడం, రాత్రి త్వరగా పడుకోవడం వల్ల పనులు సకాలంలో అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది.
2.సరైన ఆహారం, సరైనసమయంలో , సరైనపరిమాణంలో తినడం. దీనర్థం processed, packed,deep fried food కి దూరంగా ఉండాలి.
3. మానసిక ప్రశాంతత కోసం సంగీతం వినడం, స్నేహితులతో , భాగస్వామితో, పిల్లలతో సమయం గడపడం.
4. మత్తు పదార్థాలకు (పొగాకు, ఆల్కహాల్, పాన్ మసాలా) దూరంగా ఉండటం, టీ, కాఫీ మితంగా తీసుకోవాలి.
5. వీలైనప్పుడల్లా నడవడం (ప్రతి పనికీ వాహనాలు వాడకుండా).
6. నిజాయితీ గా ఉండడం, సహాయ పడాలనే గుణం పెంపొందించుకోవడం (కుల్లు, కుతంత్రాలు లేకుండా ఉండడం) మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
#ప్రపంచహృదయఆరోగ్యదినం

11/09/2021

ఈ జ్వరాల కాలం లో చిన్న విన్నపం.
డెంగీ జ్వరం , మలేరియా , కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. 90% మందికి పెద్ద ఇబ్బంది లేకుండా తగ్గిపోతుంది. అలా అని అశ్రద్ధ చేయకుండా చిన్న పిల్లలకి జ్వరం వస్తే కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి.

15/06/2021

కరోనా నుంచి కోలుకున్న తర్వాతతరుచూ వచ్చే సమస్యలు
తల నొప్పి,
ఒళ్ళు నొప్పులు
ఆయాసం,
గుండె దడ, గుండె నొప్పి
మతి మరుపు,
దగ్గు, జ్వరం.
షుగర్,
ఈ లక్షణాలు కరోనా వచ్చి పోయిన 2 నుంచి 4 వారాలకు వచ్చే అవకాశం ఉంది.
గమనించి పై లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదింగలరు.

02/06/2021

We provide out patient services to all ages of people (whole family).
Every single disease is treate

Address

బరోడా బ్యాంక్ ఎదురుగా, సుధ థియేటర్ ఎదురు వీధి, హామస్ పేట
Proddatur
516360

Opening Hours

Monday 6am - 9pm
Tuesday 6am - 9pm
Wednesday 6am - 9pm
Thursday 6am - 9pm
Friday 6am - 9pm
Saturday 6am - 9pm
Sunday 6am - 1pm

Telephone

+918897711461

Website

Alerts

Be the first to know and let us send you an email when RIFA hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category