Gayatri Jyothishalayam

Gayatri Jyothishalayam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gayatri Jyothishalayam, Astrologist & Psychic, Rayavarapu Street 29-32/5, Rajahmundry.

01/10/2022

శ్రీకాలభైరవపంచరత్నస్తుతిః

ఖడ్గం కపాలం డమరుం త్రిశూలం హస్తాంబుజే సందధతం త్రిణేత్రం .
దిగంబరం భస్మవిభూషితాంగం నమామ్యహం భైరవమిందుచూడం .. 1..

కవిత్వదం సత్వరమేవ మోదాన్నతాలయే శంభుమనోఽభిరామం .
నమామి యానీకృతసారమేయం భవాబ్ధిపారం గమయంతమాశు .. 2..

జరాదిదుఃఖౌఘవిభేదదక్షం విరాగిసంసేవ్యపదారవిందం .
నరాధిపత్వప్రదమాశు నంత్రే సురాధిపం భైరవమానతోఽస్మి .. 3..

శమాదిసంపత్ప్రదమానతేభ్యో రమాధవాద్యర్చితపాదపద్మం .
సమాధినిష్ఠైస్తరసాధిగమ్యం నమామ్యహం భైరవమాదినాథం .. 4..

గిరామగమ్యం మనసోఽపి దూరం చరాచరస్య ప్రభవాదిహేతుం .
కరాక్షిపచ్ఛూన్యమథాపి రమ్యం పరావరం భైరవమానతోఽస్మి .. 5..

ఇతి శృంగేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహ-
భారతీస్వామిభిః విరచితా శ్రీకాలభైరవపంచరత్నస్తుతిః సంపూర్ణా .

https://devullu.com/books/garuda-nori/Garuda Puranam Telugu -Nori Bhogeswara sarma-Nori Bhogeswara sarmaగరుడ పురాణం-Nori...
02/05/2022

https://devullu.com/books/garuda-nori/
Garuda Puranam Telugu -Nori Bhogeswara sarma
-Nori Bhogeswara sarma
గరుడ పురాణం

-Nori Bhogeswara sarma, Garuda Puranam Telugu, garuda puranam telugu audio, garuda puranam telugu book online shopping, garuda puranam telugu book price, garuda puranam telugu gita press, garuda puranam telugu mp3 download, garuda puranam telugu ttd, garuda puranam telugu wikipedia, sri garuda puranam telugu pdf free download, గరుడ పురాణం

22/11/2020

మత్స్య యంత్రము

మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి 'మత్స్యావతారము'. విష్ణు ద‌శావ‌తార‌ముల‌లో మొట్టమొద‌టి అవ‌తార‌మే మ‌త్స్యావ‌తార‌ము వేద స‌ముద్ధర‌ణ‌కై అవ‌త‌రించిన శ్రీ మ‌హావిష్ణువు రూప‌ము. ఈ యంత్రము, ఇత‌ర యంత్రముల క‌ంటే చాలా విశిష్టమైన‌ది. స‌మ‌స్త వాస్తు దోష నివార‌ణ యంత్ర రాజ‌ము ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము – వాని ప్రస్థార‌ము నందు గ‌ల స‌ప్తావ‌ర‌ణ‌ల‌లోను అతి ముఖ్యము శ‌క్తివంత‌మైన బీజాక్షర‌ముల‌తో రూపొందించ‌బ‌డి, స‌ర్వ సాంప్రదాయాను కూల‌ముగా నిర్మించ‌బ‌డింది.

పూజా విధి ఈ మ‌త్స్య యంత్రమును శాస్త్రానుసార‌ముగా దైవ‌జ్ఞుల‌చే త‌యారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ క‌ళాన్యాస‌, ప్రాణ‌ప్రతిష్టాదుల‌ను జ‌రిపించి, శుభ స‌మ‌య‌మున యంత్ర పూజ‌, జ‌పాదుల‌ను ప్రారంభించ‌వ‌లెను. ఈ యంత్రమును శ‌క్తివంత‌ముగా చేయుట‌కై విధి విధాన‌మును మిగిలిన యంత్రముల క‌న్న కొంచెం ఎక్కువ‌గానే నిర్ధేశింప‌బ‌డిన‌ది.

మత్స్య యంత్రమును
శ్లో || స్వర్ణేన రజతే నాపి పంచాంగుళ ప్రమాణకమ్ |
యంత్రపత్రం విరచ్యాధ సప్తకోణం లిఖేత్పురమ్ |
వాదిక్షాంతాని ‍ బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |
మధ్యేతు మత్స్య మాలిఖ్య గృహస్థాపన శోభనమ్ |
అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |
శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ ||

మత్స్య యంత్రంను ఐదు శేర్ల ధాన్యములో ఒక దినం, పంచామృతములందు ఒక దినం మంచి నీటిలో ఒక దినము ఉంచి పూజించి సహస్రాష్టోత్తర శతగాయత్రి జపమును చేసి శంఖు స్థాపన చేసిన గృహ స్థలములలో ఈ యంత్రమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ యంత్రంను స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు, కూప వేధలు, స్తంభ వేధలు, వీధి శూలలు ఆయుర్ధాయము నశించిన గృహ దోషములు, శంఖు స్థాపన చేయక కట్టిన దోషమును మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం,

More Information

Join Telegram Channel
https://t.me/mohantv

భక్తి జోతిష్య వాస్తు మంత్ర తంత్ర యంత్ర ఆయుర్వేద గ్రంథాలకు ఇప్పుడు ఆన్ లైన్ లో
www.Devullu.com

తుంగభద్ర నది పుష్కరము 2020వ సంవత్సరంలో నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి.       బృహస్పతి మక...
14/11/2020

తుంగభద్ర నది పుష్కరము


2020వ సంవత్సరంలో నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి.

బృహస్పతి మకరరాశిలో ప్రవేశించునప్పుడు తుంగభద్రనది పుష్కరాలు నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్ర నది పుష్కరాలు 2008, డిసెంబర్ 10న ప్రారంభమై 12 రోజుల పాటు జరిగాయి. తుంగ, భద్ర రెండు నదుల కలయిక వలన కర్ణాటకలో పుట్టిన తుంగభద్రనది ఆంధ్ర ప్రదేశ్లో ప్రవేశించి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల గుండా ప్రవహించి ఆలంపూర్ సమీపంలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర పుష్కరాలను నిర్వహించడం ఇది తొలిసారి. ఈ నది ఆంధ్రప్రదేశ్‌లో రెండే జిల్లాల నుండి ప్రవహిస్తుంది కాబట్టి రెండు జిల్లాలలో ఉన్న తుంగభద్ర తీరప్రాంతాలలో స్నానఘాట్లను ఏర్పాటుచేసి జిల్లా యంత్రాంగం 12 రోజుల పాటు యాత్రికులకు సౌకర్యాలు కలుగజేసింది.

____________________
free pdf book link
https://devullu.com/books/tungabhadra-nadhi-pushkara-visishtata/
++++++++++++

తుంగభద్ర పుష్కరం విశిష్టత

దేశంలో పుష్కరాలు నిర్వహించే 12 నదులలో తుంగభద్రనదికి ఒక ప్రత్యేకత ఉంది. ఇతర పుష్కర నదుల వలె కాకుండా ఈ నది సరాసరి సముద్రంలో సంగమించదు. అంతేకాకుండా ఈ నది పుట్టుక కూడా ఇదే పేరుతో లేదు. కర్ణాటక రాష్ట్రంలో తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక వలన ఏర్పడిన ఈ నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహించి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మకరరాశిలో గురుడు ప్రవేశించినప్పుడు తుంగభద్ర నది పుష్కరాలు నిర్వహిస్తారు. తుంగభద్ర రెండు జిల్లాలలోనే ప్రవహిస్తున్ననూ అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా వాసులు కూడా ఈ నీటిని వినియోగిస్తున్నారు. చెన్నై వరకు వెళ్ళే తెలుగుగంగలో కూడా తుంగభద్ర ఉంది. చరిత్రలో ప్రముఖ రాజ్యమైన విజయనగర సామ్రాజ్యము తుంగభద్ర తీరానే వెలిశింది.

ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర పుష్కరాలు
తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్‌లో రెండే జిల్లాల గుండా ప్రవహిస్తుంది కాబట్టి తుంగభద్ర పుష్కరాలు కేవలం ఈ రెండు జిల్లాలలో తుంగభద్ర తీరాన ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 17 ఘాట్లను, మహబూబ్ నగర్ జిల్లాలో 5 ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటుచేసి పుష్కర సమయంలో వచ్చే భక్తులు, యాత్రికులకు సౌకర్యాలను కల్పించింది.

మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు

మహబూబ్ నగర్ జిల్లాలో 5 తుంగభద్ర పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. అన్నింటిలో ప్రముఖమైనది ఆలంపూర్. ఇది కాకుండా వడ్డేపల్లి మండలం రాజోలి, మానోపాడు మండలం పుల్లూరు, అయిజా మండలం వేణిసోంపూర్, పుల్లికల్ లలో ఘాట్లను ఏర్పాటుచేశారు. పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.5 కోట్లను కేటాయించింది. తొలి రోజు (డిసెంబర్ 10, 2008) ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖమంత్రి రత్నాకర్ రావు, టీటీడి బోర్డు చైర్మెన్ ఆదికేశవులు నాయుడు పాల్గొన్నారు. రెండో రోజున ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆలంపూర్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్రమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మూడవ రోజు నుంచి జిల్లాలో భక్తుల రద్ది పెరిగింది. నాలుగు, ఐదవ రోజులలో సెలవు దినాలు ఉండుటచే ఊహించని రీతిలో రద్దీఏర్పడింది. రోజులు గడిచే కొలది రద్దీ పెరిగి 11వ రోజున భక్తుల సంఖ్య 2లక్షలకు పెరిగింది. చివరి రోజు రెండున్నర లక్షల ప్రజలు పుష్కర స్నానాలు చేశారు.[3] మహబూబ్ నగర్ జిల్లాలో 5 స్నానఘాట్లను ఏర్పాటు చేయగా దాదాపు సగభాగం కంటే ఎక్కువ రద్దీ ఒక్క ఆలంపూర్ లోనే ఏర్పడింది. పురాతనమైన దేవాలయాలు ఉండుట, 5వ శక్తిపీఠం కావడం, నదిలో నీళ్ళు సమృద్ధిగా ఉండుటచే దూరప్రాంతాల భక్తులు ఇక్కడికే వచ్చారు. వేణిసోంపూర్‌ అయిజా నుండి ఎమ్మిగనూరు వెళ్ళు మార్గంలో ఉండుటచే మంత్రాలయం వెళ్ళు భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు. వేణుగోపాలస్వామి దేవాలయం ఉండుట ఇక్కడి అదనపు ఆకర్షణ. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డీపోలు ప్రధాన పట్టణాలనుండి పుష్కర స్థానాల వరకు ప్రత్యేక బస్సులను నడిపించారు. 2020వ సంవత్సరంలో నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. ఈ సారి కొవిడ్-19 కారణంగా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. కానీ, గతంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ల వద్ద భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పుణ్యస్నానాలను ఆచరించవచ్చని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి.

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలకై 17 ఘాట్‌లను ఏర్పాటుచేశారు. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాలో లక్షలాది యాత్రికులు వచ్చారు. జిల్లా కేంద్రంలోనే 5 పుష్కర స్నానఘాట్లను ఏర్పాటు చేయగా తుంగభద్ర పంప్‌హౌస్, సంకల్‌బాగ్‌లలో 5లక్షల వరకు భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. విశ్వహిందూ పరిషత్తు ప్రముఖుడు ప్రవీణ్ తొగాడియా కూడా కర్నూలులో సంకల్‌బాగ్ వద్ద స్నానమాచరించాడు. జిల్లాలోని ప్రముఖ పట్టణాల నుండి పుష్కర ఘాట్‌ల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

తుంగభద్రా నది - పుష్కర విశిష్ఠత

మేష రాశి వారి జీవితం దీపావళి నుండి కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది | |Mesha rasi dewali Effecthttps://youtu.be/vQ4IQb4xK...
01/11/2020

మేష రాశి వారి జీవితం దీపావళి నుండి కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది | |Mesha rasi dewali Effect
https://youtu.be/vQ4IQb4xKcg

Please subscribe my channel for more videos telugu astrology learining - learn astrology in telugu | sig...

10/10/2020
31/08/2020

రేపు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం

*శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం*

ఈ పరమ పవిత్రమైన కథను నైమిషారణ్యంలో సూతమహర్షి శౌనకాది మహామునులకు చెబుతున్నారు.

పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించేందుకు శ్రీకృష్ణుపరమాత్మ వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు.

కుశలప్రశ్నలయ్యాక "హే కృష్ణా..! మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశంచమని" ధర్మరాజు ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘ధర్మరాజా..మీ కష్టాలు తీరాలంటే ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ ఆచరించమని సలహా ఇచ్చాడు. వెంటనే ధర్మరాజు... కృష్ణా! అనంతుడంటే ఎవరు? అని ప్రశ్నించాడు.

దాంతో కృష్ణ పరమాత్మ ‘ధర్మరాజా.. అనంత పద్మనాభుడంటే మరెవ్వరో కాదు, నేనే. నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణునిగా అవతరించాను. సృష్టి, స్థితి, లయ కారణభూతుడైన అనంత పద్మనాభస్వామిని కూడా నేనే. మత్స్య కూర్మ వరాహాది అవతారాలు నావే. నాయందు పదునలుగురు ఇంద్రులు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్తరుషులు, చతుర్దశ భువనాలు,ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి. కనుక అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించు’ అన్నాడు శ్రీకృష్ణుడు.

ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి, ఇంతకు ముందు ఎవరైనా చేసారా?’ అని ధర్మరాజు మళ్ళీ ప్రశ్నించడంతో శ్రీకృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు.

పూర్వం కృతయుగంలో వేదవేదాంగవిదుడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్తవయస్సు వచ్చేసరికి ఆమె తల్లి మరణించడంతో సుమంతడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని రెండవ భార్య పరమ గయ్యాళి. అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని, కౌండిన్యమహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్పగా ఆమె అల్లుడని కూడా చూడకుండా "ఇంట్లో ఏమీ లేదంటూ" అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి, పెండ్లికోసం వాడగా మిగిలిన సత్తుపిండినే అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపాడు.

సుగుణవతి తన భర్తతో కలసి వెడుతూ దారిలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి, అనంత పద్మనాభస్వామి వ్రతం చేస్తున్నారు. సుగుణవతి ఆ వ్రతం గురించి ఇదేమిటని ఆ స్త్రీలను అడగటంతో ఇలా చెప్పారు.

‘ఓ పుణ్యవతీ...ఇది అనంత పద్మనాభ వ్రతం. దీన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీ, నదీస్నానం చేసి, ఎర్రని చీర ధరించి, వ్రతంచేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి, పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి, ఆ వేదికకు దక్షిణ భాగంలో కలశాన్ని ఉంచి, వేదికు మరో భాగంలోకి యమునాదేవిని, మద్య భాగంలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభస్వామిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించాలి.

పూజాద్రవ్యాలన్నీ 14 రకాలుండేలా చూసుకోవాలి. కుంకుమతో తడిపిన పదునాలుగు ముడులుగల నూతన తోరాన్ని ఆ అనంత పద్మనాభస్వామి సమీపంలో ఉంచి పూజించాలి. గోధుమపిండితో 28 అరిసెలు చేసి, స్వామికి నైవేద్యం పెట్టి, వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి. దోరాన్ని కుడిచేతి కి ధరించాలి. ఇలా 14 సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యాపన చేయాలి.’ అని చెప్పారు.

సుగుణవతి అక్కడే వెంటనే అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి, తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలైంది.

కాలక్రమంలో ధనంవల్ల కౌండిన్యునకు గర్వం పెరిగింది. ఒకయేడు సుగుణవతి వ్రతంచేసుకుని, తోరం కట్టుకుని భర్త దగ్గరకు వచ్చింది. కౌండిన్యడు ఆ తోరాన్ని చూసి, కోపంగా ‘ ఎవర్ని ఆకర్షించాలని ఇది కట్టావు’ అంటూ ఆ తోరాన్ని నిప్పుల్లో పడేసాడు. అంతే...ఆ క్షణం నుంచే వారికి కష్టకాలం మొదలై, దరిద్రులైపోయారు. కౌండిన్యునిలో పశ్చాత్తాపం మొదలై ‘అనంత పద్మనాభస్వామిని’ చూడాలనే కోరిక ఎక్కువైంది. ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు.

మార్గమధ్యంలో పండ్లతో నిండుగా ఉన్న మామిడిచెట్టు పైన ఏ పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే...పచ్చగా, నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆబోతుని.., పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులను..మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న గాడిదను, ఏనుగును చూసి.... ఆశ్చర్యపోతూ ‘మీకు అనంత పద్మనాభస్వామి తెలుసా?’ అని అడిగాడు. ‘తెలియదు’ అని అవన్నీ జవాబిచ్చాయి. ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు అనంత పద్మనాభస్వామికి అతనిపై జాలికలిగి ఓ వృద్ధబ్రాహ్మణుని రూపం ధరించి అతని దగ్గరకొచ్చి, సేదదీర్చి తన నిజరూపం చూపించాడు.

కౌండిన్యుడు ఆ స్వామిని
పలువిధాల స్తుతించాడు. తన దరిద్రం తొలగించి, అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహించాడు.

సంతోషించిన కౌండిన్యుడు తను మార్గ మధ్యంలో చూసిన వింతలు గురించి ఆ స్వామిని అడిగాడు. ‘విప్రోత్తమా.. తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడిచెట్టుగానూ, మహాధనవంతుడై పుట్టినా..అన్నాతురులకు అన్నదానం చేయని వాడు అలా ఒంటరి ఆబోతుగానూ, తాను మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటి ముందు నిలబడిన పక్షుల్లాగానూ, నిష్కారణంగా పరులను దూషించేవాడు గాడిదగానూ, ధర్మం తప్పి నడచేవాడు ఏనుగులాగ జన్మిస్తారు. నాకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించేలా చేసాను. నీవు అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రలోకంలో స్థానమిస్తాను’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు శ్రీవిష్ణుమూర్తి.

అనంతరం కౌండిన్యుడు తన ఆశ్రమం వచ్చి జరిగిన. సంగతి అంతా భార్యకు చెప్పి పదునాలుగు సంవత్సరాలు అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడు.

అంటూ సాక్షాత్తూ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ గురించి చెప్పాడు.

"సర్వం శ్రీకృష్ణార్పణమస్తు"

More Information

Join Telegram Channel
https://t.me/mohantv

Follow Twitter
https://twitter.com/MohanTvBhakti

Join Facebook Group
https://www.facebook.com/groups/MohanTvBhakthi

Join Facebook Group
https://www.facebook.com/groups/BhavishyaJyoti/

Follow
https://www.facebook.com/MohanTvBhakti/

భక్తి జోతిష్య వాస్తు మంత్ర తంత్ర యంత్ర ఆయుర్వేద గ్రంథాలకు ఇప్పుడు ఆన్ లైన్ లో
www.Devullu.com

🔱పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఫలితం🔱🔱నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణల...
16/08/2020

🔱పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఫలితం🔱

🔱నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ?

🔱నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.

🔱గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.

🔱కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

🔱నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.
ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.
చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.

🔱ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.

శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:” అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం.

మొదటి ప్రదక్షిణలో జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!
రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు!

మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి.

నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!

ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!

ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి.

ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభ మృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!

ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు!

తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.

Www.Devullu.com

A Complete Telugu Devotional Store

సగం పక్షి, సగం సింహం రూపంలో ఉన్న మహాశివుని అవతారం..విష్ణుమూర్తి దశావతారాల గురించి అందరు ఏదొక సందర్భంలో వినే వుంటారు.. . ...
12/08/2020

సగం పక్షి, సగం సింహం రూపంలో ఉన్న మహాశివుని అవతారం..
విష్ణుమూర్తి దశావతారాల గురించి అందరు ఏదొక సందర్భంలో వినే వుంటారు.. . కానీ మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మాత్రం అవగాహన తక్కువే. సగం పక్షి, సగం సింహం రూపంలో ఉన్న శివుని అవతారమే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే ఈ రూపం వెనుక ఓ ఘనమైన కథ ఉంది.

విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించేందుకు
నరసింహావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే! అయితే హిరణ్యకశిపుని సంహారం తరువాత కూడా ఆయన కోపం చల్లారనే లేదట. ఆ ఉగ్రనారసింహుని క్రోధానికి లోకమంతా అల్లకల్లోలమైపోయింది. నరసింహుని నిలువరించకపోతే ఆయన కోపానికి ప్రకృతి సర్వనాశనం కాక తప్పదని భయపడ్డారు దేవతలు. అందుకోసం నరసింహుని నిలువరించమంటూ వారంతా కలిసి శివుని ప్రార్థించారట. అప్పుడు శివుడు తన అవతారాలైన వీరభద్ర, భైరవులని పంపాడట. కానీ నారసింహుని ముందు ఆ రెండు అవతారాలూ నిలువలేకపోవడంతో శరభ అవతారాన్ని ధరించాడు శివుడు.

కొన్ని పురాణాల ప్రకారం శరభ, నరసింహ అవతారాల మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో నరసింహుడు ఓడిపోయాడు కూడా. మరి కొన్ని పురాణాల ప్రకారం శరభ అవతారాన్ని ఎదుర్కొనేందుకు విష్ణుమూర్తి గండభేరుండ పక్షిగా అవతరించాడు. రెండు తలలతో ఉండే ఈ పక్షి శరభని దీటుగా ఎదుర్కొంటుంది. ఎంతసేపు యుద్ధం జరిగినా గెలుపు ఓటములు తేలకపోవడంతో, రెండు అవతారాలూ యుద్ధాన్ని విరమించుకుంటాయి.

ఎవరి మధ్య యుద్ధం జరిగినా, ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా శివకేశవులు ఇరువురూ ఒక్కటే కాబట్టి శరభను విష్ణుమాయగా వర్ణించేవారు. కేవలం శివకేశవుల పురాణాలలోనే కాదు, బుద్ధుని జాతక కథలలో కూడా ఈ శరభ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ జాతక కథల ప్రకారం శరభ బుద్ధుని పూర్వ అవతారాలలో ఒకటి!

శరభ రూపం దక్షిణాదిన, అందునా తమిళనాట ఉన్న శివాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా శైవ మతాన్ని ప్రోత్సహించిన చోళులు నిర్మించిన ఆలయాలలో ఈ ప్రతిమ తప్పక ఉంటుంది. ఒకో చోట ఈ శరభ రూపం కేవలం నామమాత్రంగానే ఉంటే, మరికొన్ని చోట్ల సకల ఆయుధాలతోనూ, దుర్గాదేవి సమేతంగా దర్శనమిస్తుంది. శివుని శరభేశ్వరునిగానో, శరభేశ్వరమూర్తిగానో కొలుచుకునే సంప్రదాయం తమిళనాట ఇంకా ప్రచారంలోనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని శైవ ఆలయాలలో కూడా ఈ రూపం కనిపిస్తున్నప్పటికీ, దానిని శరభ అవతారంగా మనం తెలుసుకోలేము..

అయితే ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాంతాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి. వీరశైవులు చేసే నృత్యాలలో శరభ, అశ్శరభ, దశ్శరభ అంటూ ఒళ్లు గగుర్పొడిచే అరుపులు వినిపిస్తాయి. తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ప్రచారంలో ఉండేదని చెబుతారు.

ఓం నమః శివాయ :
ఓం శ్రీ గురుభ్యోనమః
https://devullu.com/books/sri-swarnakarshana-bhairava-tantram/

09/08/2020

Sowbhagya Bhaskara Bhashyam
పరిమిత కాల ఆఫర్ :
Buy One Get One Free
* ఈ ఆఫర్ ONLINE PAYMENT చేసిన వారికీ మాత్రమే వర్తిస్తుంది
శ్రీ లలితా దివ్య రహస్యసాహస్రనామస్తోత్రం
శ్రీ భాస్కర ప్రణీతం
సౌభాగ్య భాస్కర భాష్యం మూల్యం.810/- వివరాలకు.9247888887
Author : Nori Bhogeswara sarma
https://devullu.com/books/sowbhagya-bhaskararaya-bhashyam/
#సౌభాగ్యభాస్కరభాష్యం
Sowbhagya Bhaskara Bhashyam
శ్రీ లలితా దివ్య రహస్యసాహస్రనామస్తోత్రం శ్రీ భాస్కర ప్రణీతం సౌభాగ్య భాస్కర భాష్యం Author : Nori Bhogeswara sarma
[Photo]

Sowbhagya Bhaskara Bhashyamపరిమిత కాల ఆఫర్ :Buy One Get One Free* ఈ ఆఫర్ ONLINE PAYMENT చేసిన వారికీ మాత్రమే వర్తిస్తుంద...
07/08/2020

Sowbhagya Bhaskara Bhashyam
పరిమిత కాల ఆఫర్ :
Buy One Get One Free
* ఈ ఆఫర్ ONLINE PAYMENT చేసిన వారికీ మాత్రమే వర్తిస్తుంది
శ్రీ లలితా దివ్య రహస్యసాహస్రనామస్తోత్రం
శ్రీ భాస్కర ప్రణీతం
సౌభాగ్య భాస్కర భాష్యం
Author : Nori Bhogeswara sarma
https://devullu.com/books/sowbhagya-bhaskararaya-bhashyam/
#సౌభాగ్యభాస్కరభాష్యం

04/08/2020

Address

Rayavarapu Street 29-32/5
Rajahmundry
533101

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+919247888887

Alerts

Be the first to know and let us send you an email when Gayatri Jyothishalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gayatri Jyothishalayam:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram