Kify Children’s Hospital

Kify Children’s Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kify Children’s Hospital, Hospital, Meduri Street, Danavaipeta, Rajahmundry.

Kify Children’s Hospital is here for all the typical problems that accompany a child’s growth and development, providing routine care such as immunizations, well-child check-ups, treatment for each and every child medical problem, and more.

09/04/2024
ది వాకర్ - బులెటిన్ ఆఫ్ వాకర్స్ ఇంటర్నేషనల్ 2024 మ్యాగజైన్ కోసం గ్యాస్ ట్రబుల్ గురించి రాయడానికి కిఫి హాస్పిటల్ డాక్టర్ ...
03/04/2024

ది వాకర్ - బులెటిన్ ఆఫ్ వాకర్స్ ఇంటర్నేషనల్ 2024 మ్యాగజైన్ కోసం గ్యాస్ ట్రబుల్ గురించి రాయడానికి కిఫి హాస్పిటల్ డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానించారు.

కిఫి హాస్పిటల్ డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారు అందించిన వైద్య సేవలకు దివాన్‌చెరువు లోని శ్రీ హర్షిత స్కూల్ వారు ఆయన్ను...
02/04/2024

కిఫి హాస్పిటల్ డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారు అందించిన వైద్య సేవలకు దివాన్‌చెరువు లోని శ్రీ హర్షిత స్కూల్ వారు ఆయన్ను సత్కరించారు. ప్రిన్సిపాల్ బెజవాడ దుర్గా ప్రసాద్ గారికి మరియు బెజవాడ హరి బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

శిరిడి సాయి తత్వ సాధన సత్సంగ్ మరియు కిఫి హాస్పిటల్స్ అధ్వర్యంలో దిగ్విజయం గా ఉచిత దంత వైద్య శిబిరం...శిరిడి సాయి తత్వ సా...
31/03/2024

శిరిడి సాయి తత్వ సాధన సత్సంగ్ మరియు కిఫి హాస్పిటల్స్ అధ్వర్యంలో దిగ్విజయం గా ఉచిత దంత వైద్య శిబిరం...

శిరిడి సాయి తత్వ సాధన సత్సంగం మరియు కిఫీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా) గారి సంయుక్త అధ్వర్యంలో స్థానిక నెహ్రూనగర్ శ్రీ సీతా రామ మందిరం లో ఆదివారం ఉదయం 9 గం!!ల నుండి దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం లో కిఫీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్. కరుటూరి దీపిక మరియు ఇతర కీఫీ హాస్పిటల్ వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఈ శిబిరం ఉద్దేశించి సత్సంగం వ్యవస్థాపకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థాన జిల్లా ధార్మిక కమిటీ సభ్యులు శ్రీ కాలెపు సతీష్ గారు మాట్లాడుతూ " సత్సంగం ద్వారా అనేక ఆధ్యాత్మిక మరియు సేవ కార్యక్రమములు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ వున్నాం అని , ఈ సేవ కార్యక్రమం లో సేవలు అందిస్తున్న కిఫి హాస్పిటల్ వైద్య సిబ్బంది కి మరియు కిఫి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారికి సత్సంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము" అన్నారు. ఈ వైద్య శిబిరం నిర్వహణ లో M. వీరన్న, శ్రీ కాలెపు సత్య సాయిరామ్ గారు మరియు సత్సంగం M. సత్తి బాబు, టి.అదిశ్రి గారు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరం లో దాదాపు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితం గా ఇవ్వడమైనది.

30/03/2024

మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు.

ఓ రోజు ఒక వనం లో ఒక పాము చాలా హుషారుగా పాకుతూ, దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.
దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...
ఆ పాము కోతిని కాటు వేయబోయింది...
భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది...
గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టువున్న మిగతా కోతులన్నీ అక్కడకు వచ్చి పామును పట్టుకున్న కోతిని చూసి ఇలా అనుకున్నాయి.
ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..
కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...
మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...
మనం దూరంగానే ఉండటం మంచిది అని అన్ని కోతులు వెళ్లిపోయాయి...

తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన
కోతికి నిరాశే ఎదురయ్యింది...
అలాగే భయంతో ఆ పాముని గట్టిగా పట్టుకుని కూర్చుంది.

అదే సమయంలో అటువైపుగా ఒక ముని వెళుతూ...
కోతి స్థితిని
అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.
' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది.
వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.
దాన్ని వదిలేయి" అన్నారు ఆ ముని...

ఆ ముని మాటలు విని కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు పైకి ఎక్కేసింది...
ఇందులోని నీతి ఏంటంటే...

నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...

కష్టాన్ని దూరంగా విసిరేసి కష్టానికి పరిష్కారం వెతకాలి.

అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఎవ్వరూ నిన్ను రక్షించడానికి ...
నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు అని గట్టిగా గుర్తు పెట్టుకోవాలి.

ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు...

నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం చూడకూడదు..

కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు...

కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి...
అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీ జీవితం సుఖమయం కాగలదు...

27/03/2024

కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఊయోగించను. ఆవిడ పేరు.......

మూడు నాలుగు రోజుల తరువాత అడిగా..
అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు అని.
ముగ్గురు అమ్మాయిలు అండి,

పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు.

O.K, ఏం చదువు కుంటున్నారు అని క్యాజువల్ గా అడిగా, పెద్ద అమ్మాయి M.Sc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తోంది,
ఆ అంటూ నోరు తెరిచా,

రెండో అమ్మాయి M.Sc Computers మొదటి సంవత్సరం,

మూడో అమ్మాయి ఎంబీబీస్ రెండో సంవత్సరం.

ఆ అని నోరు వెళ్ల బెట్టా. నర్సింగా అన్నా,
కాదు సార్ M.B.B.S అంది.

నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది,
ఏం మాట్లాడుతోంది. ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా?

మళ్ళీ అడిగా, అవే సమాధానాలు,

M.B.B.S ఫ్రీ సీటా అని అడిగా, అవును సార్,
ఫ్రీ సీట్ యే,
అదేదో బిల్డింగ్ ఫీజ్ అంటా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి.

ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా?

ఇక్కడే, మన ఊరి బడి లొనే 10 వ తరగతి వరకు.

లాంగ్ టర్మ్ గట్రా వెళ్లిందా ఎంబీబీస్ అమ్మాయి అని అడిగా, ఏం లేదయ్యా, మన ఊరి కాలేజ్ యే, నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా, ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది.

ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా,
రెండులో మానేశానయ్యా, నాకు కూడికలు, తీసి వేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకు రావటానికి.

మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా,

ఆయనా అందరి లాగే, ఇంటి విషయాలు ఏం పట్టవు.

ఆయన త్రాగుతాడు,
100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు ఇప్పుడు కొంచం మారుతున్నడు, పాప డాక్టర్ కోర్స్ లో చేరిన తరువాత.

మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతిలో చదువు మానిపించేసా, కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి, నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువు కొంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థం అయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగ కూడదు అని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా.

ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, మూడు మూడు నెలలు బిల్ కట్టలేక పోయే దాన్ని, పిల్లలు ఆలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు.

ఇప్పుడు కాస్త పర్వాలేదు, పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీదా పడుతున్నాను అంది.

నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ,
భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా.

లక్షలు, లక్షలు ఫీజులు పోస్తుంటే నాపిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా.

అంతే, నాకు అర్జంట్ గా వీళ్ళ ముగ్గురు పిల్లలని కలవాలి అనిపించింది.
నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయ్యాలి అని అడిగా, అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా.

నేను ఆడిగినట్లే, ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది ........

ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితే గాని, కుర్చీలపై కూర్చో లేదు.

ఆమె నేల పైనే. నాకు అలవాటే సారూ అంది,

నా పిల్లలు నాలా మిగిలి పోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు, అంది కళ్ళ నీళ్లతో.....

నేను కాదు, వీళ్లు కాదు,
నువ్వూ ... గొప్ప దానివి అన్నా.

మొదటి పది నిమిషాలు ముగ్గరు ముడుచుకు కూర్చున్నారు, తరువాత కొంచం కొంచం మాట్లాడ్డం మొదలు పెట్టారు.
తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్ లు రావటం, అవి సహాయ పడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు.

వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా.
ఏం కావాలి అని అడిగా,
ఎంత అనుకువగా ఉన్నారో, అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా, ఆహా వద్దు అనే సమాధానం.

నేను, నా అర్ధాంగి అడగంగా, అడగంగా, ఒక Two వీలర్ ఇప్పించండి, ముగ్గరము కలిసి ఊయోగించు కుంటాం, మీకు నెల నెలా ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. Two వీలర్ ఉంటే, కాస్త సౌలభ్యoగా ఉంటుంది, సగం డబ్బులు ఆటోలకు అయి పోతున్నాయి, మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. Two వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువు కునేందుకు ఉపయోగించు కుంటాము అన్నారు.

Two వీలర్ ఇప్పించా డబ్బులు కట్టి,

ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు, ఒక పది వేలు ఉంచుకోండి అని అన్నా వినకుండా.

పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్ కు వెళ్లి పోతుంది. మళ్ళీ ఇద్దరని పికప్.
పెద్ద అమ్మాయి J.L పోస్టులకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి Software ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని.

చెప్పటం మరిచా ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతి రోజు రెండు గంటలు.

ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో, మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్లు ఎందరో..

ఒకసారి ఆమె తో అన్నా, ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని,

ఏం సారూ నన్ను పనిలో నుంచి తీసేయ్యాలి అనుకుంటున్నారా, నా ఒంట్లో శక్తి ఉన్నoత వరకు నేను నా పని మానను.

ఆమెను అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని,

లేదు అన్నది, పిల్లలకు ఉంది, అయినా వీళ్లు తమ చదువులు అయిపోయి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లి పోతే తను నేనే కదండి, కోపాలు, తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడి పోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.

ఒక సారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురుంచి గొప్పగా చెబుతుంటాడు, అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని......

ఎందరో అమ్మల నిజమైన కథ..!!!

అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు .

కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి. కనీసం చదువు కున్న వాళ్లకు అర్థం అవుతుంది.

Author - Unknown

కిఫి హాస్పిటల్ డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రిలోని ప్రియదర్శిని చెవిటి మరియు మూగ ఆశ్రమంలో 150 మంది చెవిటి మర...
24/03/2024

కిఫి హాస్పిటల్ డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రిలోని ప్రియదర్శిని చెవిటి మరియు మూగ ఆశ్రమంలో 150 మంది చెవిటి మరియు మూగ పిల్లలకు బ్యాగులు, పెన్సిళ్లు, పెన్నులు, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, క్రేయాన్స్ పంపిణీ చేసారు.

రాజమండ్రిలోని GSL మెడికల్ కాలేజీలో మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు "ECG" నేర్పడానికి కిఫి హాస్పిటల్  డాక్టర్ ...
10/03/2024

రాజమండ్రిలోని GSL మెడికల్ కాలేజీలో మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు "ECG" నేర్పడానికి కిఫి హాస్పిటల్ డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానించారు.

08/03/2024

‘ఆమె’... తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది... భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే.

స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు

కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి... పాదాభివందనం!!

ఓ మహిళా.. నీవు నా జీవితంలో భాగస్వామి కావడం నా అదృష్టం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Address

Meduri Street, Danavaipeta
Rajahmundry
533105

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+91 85000 23456

Alerts

Be the first to know and let us send you an email when Kify Children’s Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kify Children’s Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category