24/09/2021
పక్షఘాతం:
వ్యాధి అత్యంత తీవ్రమైన వ్యాధులలో ఒకటి ఈ వ్యాధి ప్రపంచంలో మూడవ స్తానం లో ఉంది . ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఒకరు పక్షఘాతం బారిన పడి మరణించడం లేదా జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది .ప్రపంచంలో ప్రతి నెలకి సుమారుగా 16 లక్షల మంది పక్షఘాతం బారిన పడుతున్నారు.
అనగా కనీసం సంవత్సరనికి సుమారుగా ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల జనాభా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.ఇందులో కనీసం 70 నుండి 80 శాతం మంది చికిత్సను అందించి బాగుచేయ గలవారు ఉన్నారు 20 శాతం చేయీ దాటినా కేసులే ఉండటం గమనార్హం.
సాదరంగా పక్షఘాతం 35 స౦ ల వయసు పై పడిన వారికీ మగ, ఆడ తేడాలేకుండా కలుగుతుంది ఇంతక ముందు మగ వాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండేది ఆధునిక సమాజంలో మహిళలకు కూడా అధికసంఖ్యలో ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 29 తేదీన ప్రపంచ స్ట్రోక్ డే గా పిలువబడుతుంది
పక్షఘాతం అనగా పక్షం అనగా శరీరానికి ఒక భాగం,ఘాతం అనగా దెబ్బ, 5 -10 స౦.నుండి అధిక రక్తపుపోటు ఉన్న వారు ఈ వ్యాదికి గురైతే రక్త నాళాలు చిట్లిపోవడం వలన , రక్తంలో ఆక్సిజెన్ లెవెల్స్ తగ్గడంవలన, శరీరంలో కొలెస్ట్రాల్ అధికమవడం వలన,అంతేకాకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు తలకు బలమైన దెబ్బ తగిలి మెదడు యొక్క నాడులలో రక్త స్రావం సంభవించినప్పుడు పక్షఘాతం ఏర్పడుతుంది.
పక్షఘాతం బారిన పడినప్పుడు మన శరీరంలో ఒక సెకండ్ కి సుమారు 15 నుండి 20 లక్షల రక్త కణాలు చనిపోతూనే ఉంటాయి.పక్షఘాతం మనకి కుడివైపున బ్రెయిన్ లో కలిగినపుడు ఎడమ పక్క ఉన్న ముఖము, చేయీ, కాలు వంకర పోతాయి ఒక వేళా కుడిపక్కన బ్రెయిన్ లో స్ట్రోక్ కలిగినప్పుడు ఏడమ వైపున ముఖము చేయీ, కాలు పై ప్రభావం ఉంటుంది.
లక్షణాలు :
సాధారణంగా పక్షఘాతం లో ముఖం వంకరగ మారడం,రెండు చేతులలో ఒక చేయీ బలహీన పడటం,మాటలో తేడా రావడం,తీవ్రమైన తలనొప్పికి గురవడం, అన్నం మింగడంలో ఇబ్బంది తలెత్తడం, చూపు తగ్గిపోవడం, తిమ్మిరు రావడం, నడకలో ఒకపక్కకి వంగిపోవడం లేదా పడిపోవడం,నాలుక రుచి తెలియక పోవడం,తొందరగా శరీరం అలసిపోవడం,భావోద్వేగాలకు గురి అవడం,జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, వంటివి ఇవన్నీ పక్షఘాత లక్షణాలుగా గుర్తించవచ్చు.
కారణాలు:
పక్షఘాతానికి ముఖ్యమైన కారణాలు అధికంగా మద్యపానం,ధూమపాన సేవనం,అధిక ఒత్తిడి,అధిక రక్తపుపోటు, శరీరంలో పేరుకున్న అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు,మధుమేహం,వంశపారంపర్యం, రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి వాడే మాత్రలు, ప్రత్యేక కారణాలుగా చెప్పవచు అంతే కాకుండా శరీరానికి సరైన వ్యాయామం లేక పోవడం, సరైన నిద్ర, దినచర్య, ఆహార విహార పత్యం అపత్యం లను పాటించక పోవడం, మనోవేదన, తీవ్రమైన ఆలోచన కోపం వంటివికూడా పక్షఘాతానికి కారణాలు అవుతున్నవి.
చికిత్స:
పక్షఘాత లక్షణాలు కలిగిన వెంటనే కనీసం 3 గంటల లోపు అత్యవసరమైన చికిత్స తప్పనిసరి అవసరమైనది ముందుగా మీ దగ్గరలో ఉన్న న్యూరోలాజిస్ట్ ని వెంటనే సంప్రదించి మెదడులోని రక్త నాళాలు చనిపోకుండా మరియు మొత్తం శరీరం ఆధీనంలోకి రావడానికి చికిత్సను తీసుకోవలసి ఉంటుంది.
ఇందుకొరకు ఆధునిక వైద్యులు 48 గంటలు ఎమర్జెన్సీ కేర్ లో ఉంచి CT SCAN ECG lipid profile, CVD వంటి టెస్టుల ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించి చికిత్సను అందిస్తారు. తర్వాతా ఈ వ్యాధి కొరకు ఫిజియో థెరపీ టాబ్లెట్స్ పై ఆధార పడవలసి ఉంటుంది.
ఈ వ్యాధి బారిన పడిన వారికి (Kalpataru Ayurveda Hospitals) ఆయుర్వేద హాస్పిటల్స్ పక్షఘాత౦ బారిన పడిన వారికి 2009 చికిత్సను ప్రారంభించింది.ముఖ్యంగా పక్షఘాతం బారిన పడిన పేషెంట్స్ ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ ఐన పేషెంట్స్ కి చికిత్సను అందించింది మొట్ట మొదటి సారిగా తెలంగాణ లోని కొన్ని మండలాల లో పక్ష గతం కనిగిన పేషెంట్ కి ఇంటి వద్ద చికిత్సను ఆరంభించింది.
వీరికి 40 దినముల పాటు చికిత్సను అందించి అద్భుతమైన ఫలితాలను సాధించింది. కొర్పొరేట్ హాస్పిటల్ చికిత్స అందించిన కనీసం కదలలేని పేషెంట్స్ కి ౪౦ దినములలో పేషెంట్ కోలుకోవడం, 3 నెలలలోనే 90 % రికావోరీ కావడం విశేషం. కనీసం 10 మందికి చికిత్స అందించిన తర్వాత వేర్వేరు ఫలితాలు సాధించడం జరిగింది.
ముఖ్యం గా ఎమర్జెన్సీ తర్వాత వెంటనే వచ్చిన వారికి ౧౦౦% ఫలితాలు సాధ్యం ఐనది. కనీసం నెల - ౩ నెలల లోపు ౯౦% ౬ నెలలలోపు ౮౦% ౧ ఇయర్ లోపు వారికీ ౭౦% ఫలితాలను అందించడం జరిగింది.1 ఇయర్ తర్వాత ఈ వ్యాధిలో ఎలాంటి చికిత్స ఉండదు కేవలం శరీరాన్నిబిగుసుకున్న కాలు చేయీ ని నడుము భాగాన్ని ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడం తప్ప ఎలాంటి ఫలితాలు ఉండవూ.
Kys చికిత్స పద్దతులలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పేషెంట్ యొక్క శరీర తత్త్వాన్ని బట్టి వ్యాధిని బట్టి ఆహార విహార వ్యాయమ, ధ్యాన, ఔషధ మరియు ఆయుర్వేద పంచకర్మ చికిత్స పద్ధతులు ఉంటాయి. త్వరగా కోలుకోవడానికి పేషెంట్ కి ముఖ్యంగ పక్షఘాతం రాగానే ప్రతిదినం మేకపాలు, లేదా గొర్రెపాలు వేడి చేసి పలుచగా నీళ్లు కలిపి ఉదయం సాయంత్రం తాగిస్తూ ఉండాలి. బ్రహ్మి అశ్వగంధ, ఆమ్లా సరస్వతి, లాంటి బలమైన ఔషధాలను అందించాలి. తాటి బెల్లం, ఆవునెయ్యి, పండ్లు , అందించాలి,
Kys చికిత్సలయం లో కనీసం ౩౦ దినముల చికిత్స మొదటి స్టేజి లో రుగ్మతను బట్టి సమయం పెంచవలసి వస్తుంది. ఏదేమైనా ఎంత త్వరగా పేషెంట్ చికిత్స తీసుకుంటే అంత మంచిది.
మొక్క చనిపోయాక నీరుపోసిన ప్రయోజనం కలగదు కనుక వ్యాధి బారిన పడిన వెంటనే ఆయుర్వేద చికిత్సను పొందవలె
kalpataru Ayurveda hospitals
Hyderabad