09/09/2022
మెడనొప్పి ,వెన్నముక్క నొప్పి ,సయాటికా నొప్పి మోకాళ్లపై అరుగుదల కు ఆపరేషన్ అవసరమా ? ముందు చూపు ఏమిటి ? మన భవిష్యతు ఏమిటి ?
కేవలం నొప్పి తగ్గడం ముఖ్యమా ? లేదా శాశ్వత పరిష్కారమా ? ఆలోచించండి !
మన వెన్నముకలో 33 ఎముకల కూర్పు ఉంటుంది
రెండు ఎముకల మధ్యలో 15 mm APD మందంతో (intervartibral disk) మెత్తని ఎముక ఉంటుంది
మెడ, నడుము రెండు భాగములలో ఎక్కువ కదలికలు చేయడానికి ఉపయోగ పడుతాయి .
మెడలో C2 నుండి C 7 మధ్యలో కానీ L 1 నుండి L 5 -S 1 మధ్యభాగం లో సమస్య మొదలై
15 mm APD ఉన్న (intervartibral disk) మెత్తని ఎముక వరుసగా 11 ,10 ,9 ,8 ,7 ,6 ,5 MM APD వరకు తగ్గడం వలన సమస్య తీవ్రమై సర్జరీ కి దారి తీస్తుంది.
15 MM APD లో ఉన్న (intervartibral disk) మెత్తని ఎముకల మధ్యలో శరీరం మొత్తానికి రక్త ప్రసరణను అందించే ముఖ్యమైన నరాలపై ఒత్తడం వలన రక్త ప్రసరణ తగ్గి ఆపరేషన్ కి దారి తీస్తుంది.
ఈ సమస్య మొదట నడుము, మెడలో నొప్పితో ఆరంభమై నొప్పి ఎక్కువవుతున్న కొద్దీ , మరియు (intervartibral disk) యొక్క మందము తగ్గుతూ నరము పై ఒత్తడం వలన సమస్య ఎక్కువగా అవుతుంది.
చాల మంది నడుము నొప్పిన, మెడ నొప్పిన అది కేవలం నొప్పి అని అనుకుంటారు .సాధారణంగా దానికి నొప్పి టాబ్లెట్స్ వాడటం మొదలు పెడతారు. దాని వలన కొంత మందికి నొప్పి పూర్తిగా తగ్గిపోయి కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత నొప్పి మొదలవుతుంది అంతేకాకుండా రెండోసారి నొప్పి కి నొప్పి మందులతో తగ్గే అవకాశముండదు.
అందుకు మనం వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే MRI ని తీయాలని చెప్పబడుతుంది. MRI తీసిన తర్వాత వాస్తవ విషయాలు పేషెంట్ కి తెలుస్తుంది.
ముఖ్యంగా ఈ సమస్యలు నొప్పితో కూడుకున్నవి కావు రెండు ఎముకల మధ్య ఉన్న మెత్తని డిస్క్ శరీర బలహీనత వలన ఒత్తిడికి గురై ఎముకకి ఎముకకి మధ్యలో ఉన్న డిస్క్ వెన్నపూస మధ్యలో ఉన్న ముఖ్యమైన నరాలపై కి వచ్చి రక్త ప్రసరణ కాకుండా అడ్డకుంటుంది.
అందువలన మెడలో ఉన్న నరంపై డిస్క్ ఒత్తినప్పుడు C 2 నుండి C 7 వరకు సమస్య పెరిగి భుజము వెనుక భాగం బలహీనపడి పూర్తిగా కుడి లేదా ఎడమ లేదా రెండు చేతులు కూడా సన్నగిల్లే అవకాశముంది. ఎముకల మధ్యన ఉన్న ద్రవపదార్థము కూడా ఎండిపోయే అవకాశముంది. పెద్ద వయసు వాళ్ళు అనగా 45 వయస్సు పై పడిన వాళ్లలో తల తిప్పడం , తల తిరిగి పడిపోవడం జరుగుతుంది.