Sai krishna Gupta Medicals, Tenali

Sai krishna Gupta Medicals,  Tenali మన తెనాలి లో అన్ని మందులు దొరికే ఒకే ఒక చోటు.

*Medicine Is Not Always Found In Bottles, Tablets or Vaccines*(This is one of the wonderful posts I received on WhatsApp...
12/03/2022

*Medicine Is Not Always Found In Bottles, Tablets or Vaccines*

(This is one of the wonderful posts I received on WhatsApp. Love reading and realising and living it.)

"Detoxification is Medicine
Quitting Junk Food is Medicine
Exercise is Medicine.
Fasting is Medicine.
Nature is Medicine.
Laughter is Medicine.
Vegetables And Fruits Are Medicine.
Sleep is Medicine.
Sunlight is Medicine.
Gratitude And Love Are Medicine.
Friends are Medicine.
Meditation is Medicine.
Being Fearless is Medicine
Postive attitude is Medicine
Unconditional love towards all living beings is Medicine
Listening is medicine
Speaking up and sharing is medicine .
ACCEPTING & STAYING IN PRESENT MOMENT IS THE BEST MEDICINE"

08/07/2021
24/04/2021

Corona Vaccine Body Pains Treatment Explained by Dr Sunil Kumar | Telugu Popular TVFor More Updates :☛Subscribe to our Youtube Channel : https://goo.gl/yIl0q...

18/04/2021

కరోనా: కొన్ని ప్రశ్నలు - సమాధానాలు
1. వ్యాక్సిన్ కరోనా వైరస్ ని ఖతం చేస్తుంది అన్నారు, నిజమేనా?
సమాధానం: వ్యాక్సిన్ అనేది కరోనా వెంట్రుక కూడా పీకలేదు, పీకదు.
2. మరి వ్యాక్సిన్ వలన ఉపయోగం ఏమిటి ?
సమాధానం: వ్యాక్సిన్ అనేది మన శరీరం లో ఉన్న మన రక్షణ కణాలు (యాంటీ బాడీస్) ని నిద్ర లేపుతుంది.
3. వ్యాక్సిన్ ని ఎలా తయారు చేస్తారు ?
సమాధానం: బతికి ఉన్న కరోనా వైరస్ లని తీసుకొని సుత్తి తో గట్టిగా కొడితే అది చచ్చి ఊరుకుంటుంది. చచ్చి పోయిన కరోనా వైరస్ నే వ్యాక్సిన్ గా ఇస్తారు. కొన్ని సార్లు వైరస్ ని తీసుకొని దానిలోని హానికర జీన్స్ ని తీసివేసి ఆ ప్లేస్ లో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి వెక్టార్ వ్యాక్సిన్ గా ఇస్తారు. ఈ విధం గా రకరకాలుగా వ్యాక్సిన్ ని తయారు చేస్తారు.
4. భారత్ బయోటెక్ వాళ్ళ కొవాక్సిన్, ఆస్ట్రాజెనికా వాళ్ళ కోవిషీల్డ్ ఎలా తయారు చేశారు ?
సమాధానం: A. భారత్ బయోటెక్ కొవాక్సిన్: వీళ్ళు కరోనా వైరస్ ని తీసుకొని ఫార్మాల్డిహైడ్ ద్రావణం లో ముంచి చచ్చిపోయిన కరోనా వైరస్ ని వ్యాక్సిన్ గా ఇస్తారు.
B. ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్: వీళ్ళు ఎడినో వైరస్ ని తీసుకొని దానిలోని హానికర జీన్స్ తీసివేసి ఆ ప్లేస్ లో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి వెక్టార్ వ్యాక్సిన్ ని తయారు చేశారు.
5. కొవాక్సిన్ ఎలా పనిచేస్తుంది ?
సమాధానం: ముందే చెప్పినట్లు కొవాక్సిన్ వ్యాక్సిన్ అంటే చచ్చిపోయిన కరోనా వైరస్ ని ఎక్కిస్తారు. మనం కొవాక్సిన్ వేసుకుంటే అంటే మన శరీరం లోకి చచ్చిపోయిన కరోనా వైరస్ ని ఎక్కిస్తే మన శరీరం లోని రక్షణ వ్యవస్థ బతికి ఉన్న వైరస్ నే వచ్చింది అనుకొని ఎక్కువ మొత్తం లో రక్షణ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా నిజమైన కరోనా వైరస్ వచ్చినా ముందే ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ కానీ ఇంతక ముందు వచ్చిన చచ్చిపోయిన వైరస్ ని గుర్తుపట్టి ఇంకా ఎక్కువ మొత్తం లో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యి వైరస్ ని కుక్క ని కొట్టినట్లు కొడతాయి.
6. వ్యాక్సిన్ వేసుకుంటే 100% మనకి రక్షణ ఉంటుందా ?
సమాధానం: ఏ వ్యాక్సిన్ 100% ఎఫెక్టివ్ గా లేదు. ఒక వ్యాక్సిన్ 70%, ఇంకోటి 80% , మరొకటి 90% ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నై.
7. అంటే వ్యాక్సిన్ లో లోపం ఉన్నట్లా ?
సమాధానం: టెక్నికల్ గా వ్యాక్సిన్ తయారీ లోపం అని కూడా కాదు. వ్యాక్సిన్ కరక్ట్ ఉన్నా మన శరీరం లోని రక్షణ వ్యవస్థ బద్దకం గా ఉండొచ్చు. యాంటీ బాడీస్ ఉత్పత్తి కి సరైన వాతావరణం మన లోపల ఉండకపోవచ్చు. ఉదాహరణకి అగ్గిపెట్టె, అగ్గి పుల్ల ఉన్నా అగ్గిపెట్టె తడిచి ఉంటే ఉపయోగం ఉండదు. ఆ విధం గా ప్రతి ఒక్కరి శరీర తత్వం, లోపల ఉన్న పరిస్థితులని బట్టి వ్యాక్సిన్ పనిచేయటం ఉంటుంది. మరికొన్ని సార్లు వ్యాక్సిన్ ని సరైన ఉష్నోగ్రతల మధ్య నిల్వ చేయకపోయినా అది పని చేయదు. ఈ విధం గా చాలా కారణాలు ఉంటై
8. ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే ఎప్పటికీ యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయా ?
సమాధానం: ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ 3 నెలలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండోచ్చు, 3 రోజులే ఉండొచ్చు. అది వారి వారి శరీరం, తీసుకునే ఆహారం, హెల్థ్ ప్రొఫైల్, వయస్సు మొదలగు అంశాలపై ఉంటుంది.
9. ఒకసారి కరోనా వస్తే మళ్ళీ 100% ఖచ్చితం గా రాదా ?
సమాధానం: ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయింది అంటే మన శరీరం లో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ ఆ వైరస్ ని జుట్టుపట్టుకొని కుక్కని కొట్టినట్లు కొట్టి బయటికి పంపించినట్లు. రెండో సారి ఒకేసారి కొన్ని లక్షల్లో వైరస్ లు వస్తే లేదా ఆ టైం లో మనలో యాంటీ బాడీస్ లేకపోతే మళ్ళీ కరోనా వస్తుంది. మంచి ఆహారం తీసుకొని డి విటమిన్, C విటమిన్ లాంటివి కరక్ట్ మోతాదులో ఉంటే యాంటీ బాడీస్ యాక్టివ్ గా ఉండి మరొక సారి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.
10. ఒకసారి కరోనా వచ్చినవాళ్ళు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సమానమేనా ?
సమాధానం: మంచి ప్రశ్న. ఒక రకం గా ఇద్దరూ సమానమే అని చెప్పొచ్చు. కరోనా వచ్చిన వాళ్ళకి యాంటీ బాడీస్ ఉంటై, వ్యాక్సిన్ వేసుకొని అది పనిచేస్తే యాంటీ బాడీస్ ఉంటై. ఈ విధం గా చూస్తే ఇద్దరూ సమానమే
11. వ్యాక్సిన్ వేసుకున్నాక అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవటం ఎలా ?
సమాధానం: యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకుంటే తెలుస్తుంది.
12. ఏ యే యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకోవాలి?
సమాధానం: IgG, IgM యాంటీ బాడీస్ టెస్ట్
13. నేను వ్యాక్సిన్ తీసుకోను, మంచి ఆహారం తీసుకుంటాను. ఆరోగ్యకరమైన జీవన విధానం పాటిస్తాను. వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఓకే నా ?
సమాధానం: ముందే చెప్పినట్లు వ్యాక్సిన్ మనలో ఉన్న రక్షణ కణాలని నిద్ర లేపుతుంది. మీ శరీరం లో ఉన్న రక్షక కణాలు ఆల్ రడీ జాగురుకతతో ఉంటే వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఏమీ కాదు
14. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది ?
సమాధానం: కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంటే ఎడినో వైరస్ ని ఎక్కించటం. కరోనా వైరస్ కి ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్, ఎడినో వైరస్ కి ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్ ఒకటే. కోవిషీల్డ్ ద్వారా ఎడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ మన శరీరం లో ఎక్కించినా అవే యాంటీ బాడీస్ నే ఉత్పత్తి అవుతాయి
15. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేపించుకున్నాను. సెకండ్ డోస్ తర్వాత కొన్ని రోజులకి యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకుంటే ఏమీ లేవు. అంటే వ్యాక్సిన్ పనిచేయలేదా ?
సమాధానం: ఇక్కడ ఒక మతలబు ఉంది. మనం గతం లో ఎడినో వైరస్ కి గురి అయ్యి ఉంటే ఆ సమయం లో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యి ఆ వైరస్ మన రక్షణ కణాల మెమొరీ లో ఉంటుంది. ఈ సారి ఎడినో వైరస్ ఒకటో రెండో వ్యాక్సిన్ ద్వారా ఎక్కించినా వందలు, వేల సంఖ్యలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవ్వవు. కానీ నిజం గా కరోనా వైరస్ కి గురి అయితే యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. సో గతం లో ఎడినో వైరస్ వలన ఏదో ఒకటి వచ్చిన వాళ్ళకి ప్రస్తుతం కరోనా వచ్చినా త్వరగా తగ్గిపోవటానికి స్కోప్ ఉంటుంది
16. వ్యాక్సిన్ ఒకొకరికి ఒకోలా ఎందుకు పనిచేస్తుంది ?
సమాధానం: చికెన్ కర్రీ చేసి 100 మందికి పెట్టి ఎలా ఉంది అంటే కొందరు ఉప్పు తక్కువ అయ్యింది అని, ఇంకొందరు ఉప్పు కొంచెం ఎక్కువైంది అలా కొన్ని చెప్తారు. నిజానికి అందరూ కరక్టే. వాళ్ళ శరీరం లోని కెమికల్స్ కాంబినేషన్స్ వలన అలా చెప్తారు. వ్యాక్సిన్ కూడా అంతే, ఎవరి శరీరం లో ఎంత కాల్సియం ఉంది, ఎంత D విటమిన్ ఉంది, ఎంత C విటమిన్ ఉంది ఇలాంటి వాటిని బట్టి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, చేయట్లేదు అనేది ఉంటుంది.
17. వ్యాక్సిన్ వేపించుకున్నాక సినెమా నటులు, రాజకీయ నాయకుల లాగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అక్కడ గుంపు లు గుంపులు గా ఇష్టం వచ్చిన రీతిలో ఉండొచ్చా ?
సమాధానం: వ్యాక్సిన్ తీసుకున్నాం అంటే మన పక్కన ఇద్దరు అంగ రక్షకులు ఉన్నట్లు, అంతే. కరోనా దొంగలు ఒకేసారి 10 మంది, 20 మంది వస్తే మనం అవుట్. అందుకే వ్యాక్సిన్ వేసుకున్నా, వేసుకోకపోయినా మాస్క్ ధరించటం, జాగ్రత్తలు పాటించటం అన్నీ కంపల్సరీ.
18. వ్యాక్సిన్ వేసుకుంటే ఆహార అలవాట్లు మార్చుకోవాలా ?
సమాధానం: వ్యాక్సిన్ కి ఆహార అలవాట్లకి సంబంధం ఏమీ లేదు. ఇష్టం వచ్చిన పుడ్ తినొచ్చు.
19. వ్యాక్సిన్ వేసుకుంటే మందు తాగకూడదా..? స్మోకింగ్ చేయకూడదా ?
సమాధానం: సాధారణం గానే ఆల్కహాల్, స్మోకింగ్ మంచిది కాదు. మన రక్షణ వ్యవస్థ ని బలహీన పరుస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న కొన్ని రోజులు కనీసం యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యే కొన్ని రోజులు ఆల్కహాల్ కి, స్మోకింగ్ కి దూరం గా ఉంటే మంచిది.
20. వ్యాక్సిన్ వేసుకున్నాక కొన్ని రోజులకి తాగొచ్చా, స్మోకింగ్ చేయొచ్చా ?
సమాధానం: బంగారం లా తాగొచ్చు, స్మోకింగ్ చేయొచ్చు. ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ కొన్ని అయితే ఖచ్చితం గా తగ్గుతాయి కాని కం సెకం తాగొచ్చు, స్మోకింగ్ చేయొచ్చు
21. కొవాక్సిన్ బెటర్ ఆ, కోవిషీల్డ్ బెటర్ ఆ ?
సమాధానం: సాధారణం గా డెడ్ వైరస్ ఉన్న వ్యాక్సిన్ బెటర్ అంటారు కాని ఏది అయినా మీ మీ శరీర తత్వం, శరీరం లోని హెల్త్ ప్రొఫైల్, కెమికల్స్ ని బట్టి ఉంటుంది.అందరికీ ఒకేలా ఏదీ పనిచేయదు.
22. కొవాక్సిన్ సెకండ్ డోస్, కోవిషీల్డ్ సెకండ్ డోస్ ఎంత గ్యాప్ లో తీసుకోవాలి?
సమాధానం: ప్రస్తుత గైడ్ లైన్స్ ని బట్టి కొవాక్సిన్ 4-6 వారాలు, కోవిషీల్డ్ 6-8 వారాలు.
23. వ్యాక్సిన్ వేసుకున్నాక ఏమైనా అవుతుందా ?
సమాధానం: మనిషి మనిషి ని బట్టి, అది పనిచేస్తుందా లేదా బట్టి, ఎంత మోతాదు లో పనిచేస్తుంది బట్టి, మీ మీ హెల్థ్ ప్రొఫైల్స్ ని బట్టి ఉంటుంది. కాని సాధారణం గా 2-3 రోజులు ఫీవర్, వ్యాక్సిన్ ఇంజెక్షన్ చేసిన దగ్గర నొప్పి ఉంటుంది.
24. ఫీవర్ వస్తే పనిచేస్తుంది అని అనుకోవచ్చా?
సమాధానం: అలా ఏమీ ఉండదు. పనిచేస్తున్నా ఫీవర్ రాకపోవచ్చు, పని చేయకపోయినా వేరే కారణాల వలన ఫీవర్ రావొచ్చు. సమాధానం, అవును మరియూ కాదు.
25. ఏ వయస్సు వారు వ్యాక్సిన్ వేసుకోవచ్చు ?
సమాధానం: ప్రస్తుతం 45 మరియూ ఆ పైన ఉన్న వారికి ఇస్తున్నారు . ముందు ముందు 18 ఆ పైన కూడా ఇవ్వొచ్చు
26. వ్యాక్సిన్ స్టాక్ లేదు అంటున్నారు ?
సమాధానం: అది ప్రభుత్వాలని, కంపనీలని, వ్యాక్సిన్ సెంటర్స్ ని అడగాలి.
27. బ్లడ్ గ్రూప్స్ ని బట్టి కరోనా తీవ్రత ఉంటుందా ?
సమాధానం: ఉంటుంది. O బ్లడ్ గ్రూపు వాళ్ళకి కొంచెం ఎక్కువ రక్షణ ఉంటుంది. A బ్లడ్ గ్రూపు వాళ్ళకి కొంచెం తక్కువ రక్షణ ఉంటుంది. అందుకే A వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్త ఉండాలి. అయితే ఇది 1-10% మాత్రమే. ఎవరికైనా వస్తుంది, ఎవరు అయినా జాగ్రత్తగానే ఉండాలి, అందరూ ఈక్వల్ గానే జాగ్రత్తగానే ఉండాలి.
28. సాధారణ జాగ్రత్తలు ఏమిటి ?
సమాధానం: D విటమిన్ కోసం రోజుకి 30 నిమిషాలు ఎండలో నిలబడటం లేదా డి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం, సి విటమిన్ ట్యాబ్లెట్స్ లేదా ఫ్రూట్స్ తగిన మోతాదులో తీసుకోవటం. మంచి ఫౌష్టిక ఆహారం, తగిన వ్యాయాయం, మార్నింగ్ నైట్ వేడి నీళ్ళు, మధ్యానం స్టీం మొదలగు సాధారణ జాగ్రత్తలతో పాటు బయటికి వెళ్తే మాస్క్ ధరించటం. బయట ఏమి ముట్టుకున్నా శానిటైజర్స్ వాడటం మొదలగునవి పాటించటం
29. రక రకాల మనుష్యులు, పత్రికలు, TV లు, డాక్టర్లు రకరకాలుగా చెప్తున్నారు. ఏది నమ్మాలి ?
సమాధానం: చాలా మంది డాక్టర్స్ తో పాటు, మనుష్యులు, పత్రికలు, TV ల్లో చాలా ఫేక్ సమాచారం ఉంది. ఎవరినీ పూర్తిగా నమ్మొద్దు నాతో సహా. మీకు మీరు సాధారణ జాగ్రత్తలు తీసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు కానీ అజాగ్రత్త మాత్రం అసలు వద్దు.
30. చివరగా ప్రజలకి ఏమి చెప్తారు ?
సమాధానం: కారోనా వచ్చి సంవత్సరం దాటినా 138 కోట్ల మందిలో ఒక్కరు అయినా 100% జాగ్రత్తలు పాటించారా..? సెకండ్ వేవ్ మాత్రమే కాదు, ఈ విధం గా నిర్లక్ష్యం గా ఉంటే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ , ఫిఫ్త్ వేవ్ కూడా వస్తుంది.
ఎవరికి ఏమి చెప్పినా వినరు, మన దేశం లో ఉన్న 138 కోట్ల మందిలో అందరూ చెప్పే స్థితి లోనే ఉన్నారు, వినే స్థితిలో ఎవరూ లేరు సో ప్రజలకి చెప్పటానికి ఏమీ లేదు.
ధన్యవాదాలు🙏

One Stop Medical Store @ TenaliClick WhatsApp Button to Send Your Prescription and for a DoorStep Delivery in and Around...
18/04/2021

One Stop Medical Store @ Tenali
Click WhatsApp Button to Send Your Prescription and for a DoorStep Delivery in and Around Tenali

Address

Tenali
522201

Website

Alerts

Be the first to know and let us send you an email when Sai krishna Gupta Medicals, Tenali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram