19/08/2023
దేశంలో డ్రగ్స్ అక్రమ రవాణా వేగంగా పెరుగుతుంది. దీనిని అరికట్టడంలో మనము విఫలం అవుతున్నాము. ఒకప్పుడు ఏజెన్సీ ఏరియాలో దొరికే గంజాయి ఇప్పుడు చిట్ట చివర రాయలసీమ గ్రామాల్లో కూడా లభిస్తున్నాయి.
పంజాబ్ & నార్త్ ఈస్ట్ లో అక్రమంగా దొరికే ఓపియం & సింథటిక్ డ్రగ్స్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఇది ఇలాగే జరిగితే ఇంకో పది ఏళ్లలో మన దేశములో 60 శాతము యువత డ్రగ్స్ బానిసలు అవుతారు. అప్పుడు దేశ రక్షణ చేయటానికి ఆర్మీ లోకి వెళ్ళే యువత ఉండదు. ఇంజనీర్స్, డాక్టర్స్, టీచర్స్ కావాల్సిన యువత డ్రగ్ బాధితులు అవుతారు.