05/04/2020
ఎనర్జీ డ్రింక్స్....
ఈ ఎనర్జీ డ్రింక్స్ ఒక మనిషి మీద చూపించే ప్రభావాలను తెలుసుకుందాం ...
ఇప్పటి యువత సోషల్ మీడియా, యాడ్స్ మరియు వివిధ రకాల సాధనాల ద్వారా గత దశాబ్దం లో ఇన్స్ టెంట్ ఎనర్జీ అనే కొత్త కాన్సెప్ట్ లో కొచ్చేసి, అనేక రకాల ఎనర్జీ డ్రింక్స్ వాడడం మొదలుపెట్టారు . అసలు ఈ ఎనర్జీ డ్రింక్ అంటే ఏంటి వీటి వల్ల మనకు కలిగే లాభాలేంటి, నష్టాలేంటో ఒక సారి తెలుసుకుందాం.
1.గ్లూకోస్ ఆధారితమైనవి (E.g: Glucon-D, Tang, Glucovita etc.) ఇవి తత్వర శక్తి పొందటానికి శరీరం లోని గ్లూకోస్ స్థాయి పెంచడానికి
2.ఎలెక్ట్రోలైట్ ఆధారితమైనవి (Eg ORS, Gatorade etc.) ఇందులో సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి లవణాలతో తయారు చేయబడినవి. ఇవి సాధారణంగా అతిగా చెమట పట్టడం గాని, శరీరం డీహైడ్రేషన్ కు లోనైనప్పుడు ఉపయోగించేవి.
3.కెఫీన్ ఆధారిత ఎనర్జీ డ్రింక్స్ (E.g. Red bull, Monster, Sting etc.) వీటిల్లో కెఫీన్,టారిన్, మరియు విటమిన్స్
ఉంటాయి. ఈ ద్రావణాలు మీ నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి మెదడు చురుకుగా పని చేసేలా చేస్తాయి. దీనితో అప్పటికే అలసిపోయిన మీ మెదడు తిరిగి నూతన ఉత్తేజాన్ని పొంది, ఏకాగ్రత ను పెంచేలా చేస్తాయి. సరిగ్గా చెప్పాలంటే మీరు ఒక చిక్కటి కాఫీ (Black coffee) తాగితే కలిగే ప్రభావాన్ని పొందుతారు.మనం సాధారణంగా తీసుకునే కూల్ డ్రింక్స్ లో కూడా కొద్దిగా కెఫీన్ ఉంటుంది
ఈ గ్లూకోస్ మరియు ఎలెక్ట్రోలైట్ ఆధారిత డ్రింక్స్ లో నాడీ వ్యవస్థ మీద పెద్ద దుష్ఫలితాలు ఉండవు కాని కార్బోహైడ్రేట్ క్రేవింగ్, ఊబకాయం, డయాబెటిస్, దంత సమస్యలు త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మైక్రో ఎలిమెంట్స్ (Copper, Manganese, Selenium Etc) లోపాలు వస్తాయి. అంతే కాకుండా మనిషి యొక్క జీర్ణ వ్యవస్థ ఘన పదార్థాలను తీసుకోవడానికి అనువైనది, ఎప్పుడైతే ఈ ద్రావణాలను తీసుకుంటారో మన ఆహరంలోని పీచు పదార్థాలను తీసుకునే శాతం తగ్గిపోతుంది.దానితో జీర్ణ సంబంధ సమస్యలతో పాటు మలబద్దకం వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
అసలు సమస్య కెఫీన్ ఆధారిత డ్రింక్స్ తోనే , ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), కెఫీన్ ను కూడా ఓ మోతాదు మించితే అలవాటు పడిపోగల మత్తు పదార్థాలజాబితా లో చేర్చడం జరిగింది. విపరీతంగా కెఫీన్ వాడే వాళ్ళు వివిధ రకాల మానసిక సమస్యలకు ( Addiction) లోనయ్యే అవకాశం చాల ఎక్కువ ( ఆందోళన, నిద్ర లేమి, చికాకు మొ||). ఈ కెఫీన్ తో కూడిన డ్రింక్స్ ను యువత మద్యం తో పటు తీసుకోవడం మొదలెట్టడం జరుగుతోంది, దీనితో మెదడు చురుకుదనం ఎక్కువగా ఉండడం వలన వారి స్థాయిని మించి మద్యం సేవించి ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ స్థితి కి వెళ్లే ప్రమాదం ఉంటుంది. సిగరెట్ వాడే వాళ్ళలో కూడా కెఫీన్ వాడకం ఎక్కువగా ఉంటుంది.18 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు ఈ ఎనర్జీ డ్రింక్స్ వాడకూడదని FDA కూడా తెలిపింది.
ఈ దుష్ఫలితాలను గుర్తించి యువత, వీటికి దూరంగా ఉండడం ఆరోగ్య రీత్యా శ్రేయస్కరం. ఒక వేళ వాడాల్సి వచ్చినా మోతాదు మించకుండా చేసుకోకపోతే మానసిక రోగులుగా మారే ప్రమాదం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, ఇటీవల కాలం లో జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్ లకు వెళ్లే యువత ప్రోటీన్ షేక్స్, బాడీ బిల్డింగ్ పౌడర్లు వాడడం జరుగుతోంది. వీటిల్లో కొన్ని అనుమతి లేని స్టెరాయిడ్స్ వాడడం జరుగుతోంది, వాటి వల్ల తాత్కాలికంగా శారీరిక దృఢత్వం కనిపించినా, మెదడు పనితీరు పై దీర్ఘకాలం లో నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
సంపూర్ణ ఆరోగ్యం అంటే శారీరిక ఆరోగ్యం మాత్రమే కాదు కదా .......
మీ
Dr.విష్ణు వర్ధన్ గండికోట, MD
మానసిక వైద్య నిపుణులు