15/11/2018
శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాలలోని చిన్న పిల్లల విభాగంలో సర్వీసు పీజీ విద్యార్థిని *డా. శిల్పా రూపేష్* మేడం తన విభాగంలోని హెడ్ తనపై వెర్బల్ సెక్సువల్ హెరాస్మెంట్ కు పాల్పడ్డారని, దీనిని ఒక ప్రొఫెసర్ మరియు ఇంకొక అసిస్టంట్ ప్రొఫెసర్ సమర్ధిస్తున్నారని ఒకటిన్నర సంవత్సరంగా పోరాడి, అడుగడుగునా అవమానం పడి, ఎన్నో చోట్ల ప్రయత్నించి న్యాయం జరగక, చివరికి పీజీ పరీక్షలో ఫెయిల్ అయి, ఇక న్యాయం జరగదని ఆత్మస్థైర్యం కోల్పోయి గత ఆగస్టు నెలలో తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడటం, దీనిపై జూనియర్ వైద్యుల సంఘం చేసిన బలమైన సమ్మెల కారణంగా ప్రభుత్వం ఈ *కేసు* ని సీ.ఐ.డీ బృందానికి అప్పగించటం, తరువాత కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన సీ.ఐ.డీ బృందం ఈ నెల 8 వ తేదీన సమగ్ర నివేదికను మీడియా ముందు విడుదల చేయటం, అందులో శిల్పా మేడం కుటుంబ సభ్యులను నిర్దోషులుగా తేల్చుతూ A1,A2&A3 లను దోషులుగా పరిగణించిన *విషయం అందరికీ విదితమే* ...
అయితే దీనికి జూనియర్ వైద్యుల సంఘం క్రింది విధంగా స్పందించింది.
1.ఇలా సీ.ఐ.డీ బృందం నిజాలను నిస్పక్షపాతంగా బయట పెట్టడం నిజంగా హర్షించ దగ్గ విషయం. ఇంకా ప్రజాస్వామ్యం మరియు వ్యవస్థ బ్రతికి ఉన్నాయనే నమ్మకాన్ని మాలో నెలకొల్పిన *సీ.ఐ.డీ బృందానికి* ముందుగా జూనియర్ వైద్యుల సంఘం *కృతజ్ఞతలు* తెలియ జేసుకుంటోంది.
2. నిజం మరియు విద్యార్థుల ఐక్యత ముందు డబ్బులు, పలుకుబడి ఏమాత్రం నీలబడవని...
ఇలాగే ఐక్యతతో పోరాడితే కుళ్లిన వ్యవస్థను సైతం మనం మార్చగలం అని *యువత* దీని ద్వారా తెలుసుకోవాలి.
3. *విద్యార్థినులు* ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు బలవన్మరణానికి పాల్పడకుండా, ధైర్యంగా ముందుకు వచ్చి కొంచెం ఓపికగా పోరాడితే కచ్చితంగా న్యాయం జరుగుతుందని దయచేసి గ్రహించండి.
4. *ఉపాధ్యాయులు* తమ విద్యార్థుల దగ్గర నుండి భయాన్ని కాకుండా గౌరవాన్ని పొందటం కొరకు చూడండి. విద్యార్థులను తమ పిల్లలుగా భావించి నిజాయితిగా పాఠాలు చెబితే, పిల్లల్లోనూ ఉపాధ్యాయుల పట్ల గౌరవం పెరుగుతుంది. ఏదైనా సాధించగలం అనే పోటీ తత్వం పెరిగి మంచి సమాజం ఏర్పడటానికి దారితీస్తుంది. లేకుంటే ఇలాంటి బలవన్మరణాలు ఇంకా చూడాల్సి వస్తుంది.
గొరవం చిరకాలం.
భయం తాత్కాలికం.
విద్యార్థులకు మీపై
ఏది ఉండాలో మీరే ఆలోచించుకోండి.
ముఖ్య గమనిక:
విద్యార్థినులు శృంగార వస్తువులు కారు, మీ పిల్లల లానే వారు వేరొకరి పిల్లలు.
ఒక విద్యార్థినిని చెడు ఉద్ధ్యేశంతో చూసే ముందు, మీ పిల్లలను అలా వేరే వారు చూస్తే మీకు సమ్మతమేనా అని ఒకసారి ఆలోచించండి.
5. *జూనియర్ వైద్య విద్యార్థినులు* - మీకు ఏ ఒక్క సమస్య ఉన్నా మన అసోసియేషన్ వారికి తెలియజేయండి. మీకు కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాము. అది మా భాధ్యత. సమస్య వచ్చినప్పుడు అసోసియేషన్ ని విస్మరించి క్షణిక ఆవేశాలకు లొంగి ప్రాణాలు తీసుకునే పనులను దయచేసి చేయకండి.
6. *ప్రభుత్వ వైద్యులు* - ఒక సమస్య ఉందని విద్యార్థులు మీకు చెబితే దానిని అర్థంచేసుకుని త్వరగా పరిష్కరించటానికి చూడండి.
అంతేకాని నిజానిజాలు తెలుసుకోకుండా బురద జల్లే ప్రయత్నం చేయకండి 🙏.ఇది గెలుపు ఓటముల సమస్య కాదు, ఒక ఆడ బిడ్డ న్యాయాన్యాలకు సంబంధించిన సమస్య. దయచేసి అర్థం చేసుకుని, విద్యార్థులను ఇకనైనా మానసికంగా సాధించటం, వేదించటం మానేసి విద్యార్థులతో మంచిగా స్నేహంగా ఉండి మాతో కలవండి. భాద కల్గినప్పుడు తల్లితండ్రుల పైన అలుగుతామే తప్ప, మీపై మాకు కక్షలు ఎందుకు ఉంటాయి... ఎంతైనా మీరు మా *గురువులు* మరియు తల్లితండ్రులకు సమానం కదా!
7.ఎన్ని చేసినా, ఏమి జరిగినా శిల్పా మేడం ఇక తిరిగి రారు అని *తల్లిదండ్రులు* గా మీకు ఇక జీవితమే లేదని భాదపడకండి, మీ మనవడు మరియు ఇంకో కూతురు కోసమైనా బ్రతకండి...వారికి బంగారు భవిష్యత్తు ఉండాలి కదా. కనుక
ధైర్యంగా ఉండండి, కోర్టులో కూడా మేడం కి న్యాయం జరుగుతుంది.
8.ఆత్మ అనే కాన్సెప్ట్ ఉంటే, శిల్పా మేడం *ఆత్మకు* ఇప్పటికైనా *శాంతి* చేకూరాలని ఆశిస్తూ...
*ఇది ఏ వ్యక్తులతోనో పోరాటం కాదని, అస్సలు ఆ వ్యక్తులకు వ్యతిరేకం కాదని, వ్యవస్థతో పోరాటం అని అందరూ గమనించాలని కోరుకుంటూ...*
మా ఈ పోరాటంలో మాకు తోడు నిలబడిన మీడియా వారికి, పోలీసు శాఖ వారికి, వివిధ విద్యార్థి సంఘాల వారికి, ప్రజా సంఘాల వారికి, విషయం కోసం నిలబడే వ్యక్తులను కన్న తల్లితండ్రులకు, ఆ వ్యక్తులకు మరియు ముఖ్యంగా మహిళా సంఘాల వారికి *పాదాభివందనం* తెలియజేసుకుంటున్నాము 🙏.
- జూనియర్ వైద్యుల సంఘం,
శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల,
తిరుపతి.