17/10/2022
🙏🙏!! హరేకృష్ణ ఆత్మ బంధువు లందరికీ ప్రణామములు !!🙏🙏
ప్రతి రోజూ మనం ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా పఠించాల్సిన శ్లోకములు:-
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ‖ (4.24)వ శ్లోకం
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్|| (15.14)వ శ్లోకం
శ్రీ కృష్ణ భగవానుడు చెప్తున్నారు " నేను నీ లోపల వైశ్వానరుడనే జఠరాగ్ని రూపంలో ఉండి నువ్వు తిన్నదంతా నేను స్వీకరించి పచనం చేస్తాను" అని. అంటే మనం తీసుకునే ఆహారం ఆ అగ్నికి హవిస్సు లాంటిదన్నమాట.
శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క సంరక్షకుడైన భగవంతుడు - ప్రతి గ్రహంలో ప్రవేశించి, కాంతిని మూలంగా చేసుకొని చంద్రునిగా మారి తద్వారా అన్ని పంటలకు జీవరసాన్ని సరఫరా చేస్తాడు. ఇంకా శ్రీకృష్ణుడు వ్యక్తిగత స్థాయిలో కూడా మన హృదయాలలో సంరక్షకుడిగా ఉంటాడు. ఎలాగంటే మనలో జఠరాగ్నిగా, 4 రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేయుటకు ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాస కలిగి ఉన్న ప్రాణవాయువుతో కలుస్తాడు. ఆ దేవాదిదేవుడు జీర్ణం కావడానికి సహాయం చేయకపోతే, మనం తినడం కూడా ఆనందించలేము. మన జీవితంలోని మన మనుగడకు ప్రతి ఒక్క విషయంలోనూ భగవంతునిపై ఆధారపడతాము. మన
జీవితంలో మనకెవరైన సహాయం చేస్తే వెంటనే కృతజ్ఞతలు తెలియచేస్తాము కదా మరి అన్ని సమకూర్చువాడు అయిన పరమాత్మకు ఎంత కృతజ్ఞతలు తెలియజేయాలి.
మనం తినే ఆహారమే మన మనస్సు క్రింద మారుతుంది. కనుక వండుకునేటప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూనో, హరినామ సంకీర్తన చేస్తూనో వంట చేసుకోవాలి మరియు తినే ప్రతిసారి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పఠించాల్సిన భగవద్గీత శ్లోకాలు.
అసతోమా సద్గమయా |
తమసోమా జ్యోతిర్గమయా |
మృత్యోర్మా అమృతంగమయా|
ఓం శాంతిః శాంతిః శాంతిః||
అంటే మనం తినే ఆహారం మనల్ని అజ్ఞానం వైపు నుంచి వెలుగు వైపు నడిపిస్తాయి అని పై శ్లోకం యొక్క అర్ధం. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ప్రతిపూట ఈ 3 శ్లోకాలు చదివిన తర్వాతే తినడం అలవాటు చేసుకుందాం.
🙏!! హరేకృష్ణ !!🙏