29/04/2024
గుర్రం కొన్ని మతాలలో పరమ పవిత్రమైనదిగా భావిస్తాము కదా... మతానికి ఒక విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసం ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత దాన్ని పూజించే గురు పరంపరకి ఉంటుంది... ప్రవక్త అంటే ఏంటి? ప్రవర్తనలో మార్పు తీసుకురా కలిగిన వక్త ఏ ప్రవక్త... ఎవరు చేస్తారు?గురువు చేయగలరు ... మరి కొన్ని విశ్వాసాలు గా చెప్పుకునే మతాలు లో గురుపరంపర ఎందుకు ఆగిపోయింది.... ? అసలు మతానికి పెద్ద ఎవరు? ఏ మతానికైనా ఏ తత్వానికైనా భగవంతుడు ఒక్కడే అని చెప్పినప్పుడు ఈ గోలంతా ఎందుకు? వాడిపై వీడు వీడి పై వాడు... మాటలతో గానీ చేతలతో గాని కొట్టుకు చావటం ఎందుకు? ఇక్కడ మనం గమనించాల్సింది ఇప్పుడు ఉన్న వాస్తవ ప్రపంచంలో సరైన గురువు లేకపోవటమే ఇన్ని మతాలుగా విడిపోవడానికి కారణం... సనాతన ధర్మాన్ని తీసుకుంటే రుషి/ ఋషి సాంప్రదాయం మొదలైంది కానీ లేని సన్యాస సాంప్రదాయం ఎక్కడ నుంచి వచ్చింది? సన్యాసము అంటే ఏంటి ఒక మాటలో చెప్పాలంటే వాడుక భాషలో ఇప్పుడు ఉన్న ఇంగ్లీష్ భాషలో చెప్పాలి అంటే రిటైర్మెంట్ అనే కదా అర్థం.... ఒకసారి అన్నిటికీ వీడ్కోలు చెప్పాక అంటే బ్రహ్మచారిగా మొదలై గృహస్థూగా ధర్మాన్ని స్వీకరించి బాధ్యతల నుంచి తప్పుకుని ప్రకృతి పరిరక్షణ వైపు అడుగులు వేస్తూ వానప్రస్థ నివాసం అయిన ఋషి సాంప్రదాయం ప్రకారం నడిపిస్తూ ఉండి మళ్లీ అక్కడ కూడా తన వారసుని ప్రకటించి గురువుగా గౌరవంగా తప్పుకొని ఆ భగవంతుడిలో ఏకం అవ్వటం కోసం చేసే పోరాటమే ఈ మానవ జన్మ ఇది అవునన్నా కాదన్నా పచ్చి నిజం.... దీన్నే ఇంకా కంటిన్యూ చేయాలి అంటే నాకు మీ సలహాలు సూచనలు కావాలి.... మనకున్న జ్ఞానం అందరితో పంచుకోవాలి ధర్మాన్ని కాపాడాలి అధర్మాన్ని ఖండించాలి అవసరమైతే యుద్ధం కూడా చేయాల్సిన బాధ్యత కుల మతాలకు అతీతంగా ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన వాడిపై వీడు వీడి పైవాడు కోపంగా ఉంటే మొత్తానికి మానవ మానవుడే కష్టంగా ప్రసనార్థకంగా మారుతూ ఉంటుంది సోదరులారా సోదరీమణులారా మనమంతా ఒకటే మానవులం.... ఎప్పుడో పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పుకునే దేవతలు, దానవులు, దైత్యులు, గంధర్వులు, సిద్ధులు, యోగులు, కిన్నెరలు , వానర్లు, నాగులు, యక్షులు ఈ జాతులన్నీ మానవులతో సంబంధాలు తిరిగి ఏర్పాటు చేసుకోవాలన్న మనలో మనకి ఐక్యత ఉంటే వారు మనల్ని కలవను గలరు మనకి సహాయం చేయగలరు మనతో సంబంధాలు కూడా పెట్టుకోగలరు అప్పుడే మళ్ళీ నూతన యుగం ఒకటే యుగం ఇన్ని యుగాలు ఉండక్కల్లా ధర్మం పెరుగుతూనే ఉంటుంది అన్ని అసమానతలు తగ్గిపోతే కాలం పై పట్టు ఎలా సంపాదించాలో వారు వారి జ్ఞానంతో మనకు తెలిసిన సామాన్య పద్ధతుల్లో వారు వారికున్న పరిజ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటారు అందరూ కలిసి చేయాల్సిన పవిత్రమైన యజ్ఞం.... ఏకమవడం... జగమంత కుటుంబం మనది... ఆ భగవంతుడి నుంచి అన్ని ఉద్భవించాయి అని వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోను చదువుకున్నాము చెప్పుకున్నాము అటువంటప్పుడు అంతా ఒకటిగా ఉన్నా మనం మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో వర్ణం పేరుతో విడిపోవడం న్యాయమా, అన్యాయమా మీరే చెప్పాలి ఇంకా క్లుప్తంగా మాట్లాడాలి అంటే మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వండి....