
16/02/2022
ఈ రోజు హైదరాబాద్ లోని నాంపల్లి బిజెపి ప్రధాన కార్యాలయం నందు కేంద్ర పర్యాటక, సంస్కృతి అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న జి.కిషన్ రెడ్డి గారిని ఉదయగిరి నియోజకవర్గ బిజెపి కార్యవర్గం మరియు వివేకానంద యూత్ ఆధ్వర్యాన గౌరవపూర్వకంగా కలిసి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి పర్యాటకానికి నోచుకోని ఘనచరిత్ర గల మన ఉదయగిరి కోటకు, దేవాలయలకు పూర్వ వైభవం తీసుకువచ్చి ఓక మహత్తరమైన పర్యాటక రంగ ప్రాజెక్టు నాంది పలకాలని...ఆశిస్తూ
*ఉదయగిరి పర్యాటక ప్రాజెక్టు రిపోర్టు*
తెలుగులోనూ,ఇంగ్లీషులోను రెండు ప్రాజెక్టు రిపోర్టులు ఇచ్చి అక్కడి పరిస్థితులను వివరిస్తూ...ఏదో మామూలు పర్యాటకంగా కాక ఆధ్యాత్మిక పర్యాటక విశ్వవిద్యాలయంగా దక్షిణ భారతదేశంలో ద్యానం,యోగ, ఆయుర్వేదం పరిశోధనల పర్యాటకంగా...వేల సంవత్సరాల ఉదయగిరి చరిత్ర, సంస్కృతికి జీవం పోసే విధంగా విశాలమైన కోటపై కన్నులకు కట్టేవిధంగా అభివృద్ధి చేయ్యాలని వివరణాత్మక పర్యాటక ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి స్పందనగా మంత్రి కిషన్ రెడ్డి గారు తప్పకుండా ఉదయగిరి కోట పూర్తి వివరాలు తెప్పించుకోని ఈ ప్రాజెక్టు ఓక రూపం తీసుకువద్దామని చేప్పారు. మంత్రి గారిని కలవడానికి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పులిచర్ల నారాయణ రెడ్డి గారు మరియు వివేకానంద రాష్ట్ర అధ్యక్షులు ఆవుల భూపతి రాజా గారు,
మాల్యాద్రి యాదవ్, జనార్థన్ రెడ్డి,పిచ్చి రెడ్డి, శ్రీనివాసరాజు
వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.