27/08/2025
వినాయక చవితి శుభాకాంక్షలు..
పసుపు ముద్దలో ప్రాణ ప్రతిష్ట
చిన్ని రూపంలో చిరునవ్వులు
అనంత రూపంలో జ్ఞాన సంపద
లౌకికములో మేటి విజ్ఞాని..!!
ప్రకృతి రంగే ఆయన సొంతం
పచ్చని చిరునవ్వే సమాధానం
ఇంద్రధనస్సు ఆయన కిరీటం
సప్త స్వరాలే గణనాధుడు నాదం...!!
చీకట్లో వెలుగు పుంజం
అజ్ఞానంలో విజ్ఞానపు స్వరూపం
చదువులకు తిరగని నిధి
అక్షర దర్శనంతో విద్యానాథుడు..!!
పిల్లలకు ప్రియ దేవుడు
యువకులకు ఉత్సాహవంతుడు
వృద్ధులకు మోక్ష కారకుడు
అందరికీ అతనే సర్వాంతర్యామి..!!