
21/09/2025
"తెలంగాణ ఆడబిడ్డలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు!"
పూలను కొలిచే విశిష్టమైన సంస్కృతి తెలంగాణ సొంతం. భగవంతుడిని పూలతో పూజిస్తాం.. అదే పూలను భగవంతుడిగా కొలుస్తూ.. 9 రోజుల పాటు ఆడపడుచులు బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఘనంగా, అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ (Bathukamma Festival 2025) నిర్వహిస్తారు. మొదటి రోజు 2025 సెప్టెంబర్ 21 ఎంగిలి పూల బతుకమ్మ (Bathukamma) నుంచి చివరి రోజు సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) వరకు ఏ ఊరు చూసినా సంబరాల్లో మునిగితేలుతుంటుంది.